10 నెలల్లో 80,500 కోట్ల అప్పులు.. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదం: కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి.. అధికారం కోల్పోయిన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న కేటీఆర్.. ప్రభుత్వ వైఫల్యాలపై వరుసపెట్టి ట్వీట్లు పెడుతున్నారు.

Update: 2024-10-16 03:49 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి.. అధికారం కోల్పోయిన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న కేటీఆర్.. ప్రభుత్వ వైఫల్యాలపై వరుసపెట్టి ట్వీట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలలకే 80,500 కోట్లు అప్పు చేసిందంటూ మాజీ మంత్రి కేటీఆర్.. ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో "రేవంత్ కుర్చీ ఎక్కిన రోజు నుండి తెచ్చిన మొత్తం అప్పులు 80,500 కోట్లు. అప్పు- తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలి..? ఎన్నికల హామీలేవీ తీర్చలేదు..! ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు. మరి ముఖ్యమంత్రి తెస్తున్న అప్పు ఏమైనట్టు. 80 వేల కోట్ల ధనం ఎవరి జేబులోకి వెళ్లినట్టు. అప్పు.. శుద్ధ తప్పు అని ప్రచారంలో ఊదరగొట్టి. అవే అప్పుల కోసం ముఖ్యమంత్రి పాకులాడటమేంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో.. అప్పులు తీసుకుని ప్రాజెక్టులు కట్టామని, ప్రతి పైసాతో మౌలిక సదుపాయాలు పెంచామని, తీసుకున్న రుణంతో దశాబ్దాల కష్టాలు తీర్చామని అన్నారు. కానీ గత 10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న అప్పులు దేనికి ఖర్చు చేస్తున్నారో తెలియడం లేదని విమర్శించారు. రాష్ట్ర సంపద సృష్టికి కాకుండా.. సొంత ఆస్తులు పెంచుకోవడానికి..అప్పులు చేయడం క్షమించరాని నేరం. ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదం అని మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించారు.


Similar News