Sabarimala special trains : తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త చెప్పింది. శబరిమల పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసినట్లు ఎస్సీఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: అయ్యప్ప భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త చెప్పింది. శబరిమల పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసినట్లు ఎస్సీఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల నుంచి 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని భక్తులను కోరింది.
ఈ నెల 22,29 తేదీల్లో మౌలాలి-కొల్లాం, ఈ నెల 24, డిసెంబర్ 1 వ తేదీల్లో కొల్లాం-మౌలాలి, ఈ నెల 18,25 మచిలీపట్నం-కొల్లాం, ఈ నెల 20, 27 తేదీల్లో కొల్లాం-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాగా, ప్రయాణీకుల రద్దీని క్లియర్ చేయడానికి, దక్షిణ మధ్య రైల్వే (SCR) వివిధ గమ్యస్థానాల మధ్య 26 శబరిమల ప్రత్యేక రైళ్లను ఇది వరకే ప్రకటిచిన విషయం తెలిసిందే.