ఎంసెట్ తొలి విడతలో 70 వేల ఇంజనీరింగ్ సీట్ల భర్తీ

రాష్టంలో ఎంసెట్ మొదటి విడత కౌన్సిలింగ్ ఆదివారం ప్రాంభమైంది.

Update: 2023-07-16 13:34 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్టంలో ఎంసెట్ మొదటి విడత కౌన్సిలింగ్ ఆదివారం ప్రాంభమైంది. ఇందులో మొదట ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టారు. తొలి విడత కౌన్సిలింగ్ లో 70,665 సీట్లను ఇంజనీరింగ్ విభాగంలో భర్తీ చేశారు. మరో 1201 సీట్లు ఖాళీగా ఉన్నాయి. తొలి విడత కౌన్సిలింగ్ లో సీట్లు పొందిన విద్యార్థులు జులై 22 లోపు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఎంసెట్ కన్వీనర్ తెలిపారు. కోర్సుల వారీగా మొదటి దశలో జరిగిన కౌన్సిలింగ్ లో అధికశాతం విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో చేరేందుకు మొగ్గు చూపారు. ఈ కోర్సులో అత్యధికంగా 94.2 శాతం చేరగా ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లో 58.38 శాతం, సివిల్ ఇంజనీరింగ్ లో 44.76 శాతం, మెకానికల్ ఇంజనీరింగ్ లో 38.5% సీట్లు భర్తీ అయ్యాయి.

రాష్టంలోని మూడు యూనివర్సిటీల్లో అలాగే 28 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో 100 శాతం సీట్లు తొలి విడతలోనే భర్తీ అయ్యాయి. ఈనెల 24వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ఉంటుందని ఆ తర్వాత ఆగస్టు నాలుగున చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా 14,565 ఇంజనీరింగ్ సీట్లకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో మొత్తం ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య లక్షా 671కి చేరింది.

Tags:    

Similar News