Breaking News : తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం
తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల(MLA Quota MLC) స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల(MLA Quota MLC) స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ మేరకు ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన జారీ చేశారు. ఏకగ్రీవం అయిన ఎమ్మెల్సీలకు ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా విజయశాంతి, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సత్యం నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు మరో ఆరుగురు నామినేషన్లు దాఖలు చేయగా.. నామినేషన్లు సరిగా దాఖలు చేయని కారణంగా అవి తిరస్కరించబడ్డాయి. దీంతో ఈ ఐదుగురు ఏకగ్రీవం అయ్యారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్ కు 4 స్థానాలు రాగా.. వాటిలో ఒకటి పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించింది. ఫలితంగా కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ లు.. సీపీఐ నుంచి సత్యం నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ కు ఒక స్థానం రాగా.. ఆ పార్టీ నుంచి దాసోజు శ్రావణ నామినేషన్ దాఖలు చేశారు. కాగా వీరంతా ఏకగ్రీవం అయినట్టు ఈసీ ప్రకటించింది.
Read More..
స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు.. ఓయూలో మాజీమంత్రి జగదీశ్ రెడ్డి శవయాత్ర