మైనర్‌పై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో మైనర్‌పై అత్యాచారం చేసిన నిందితుడికి భువనగిరిలోని పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
దిశ, తుర్కపల్లి(ఎం): యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో మైనర్‌పై అత్యాచారం చేసిన నిందితుడికి భువనగిరిలోని పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. ఆరేళ్ల క్రితం మండల కేంద్రానికి చెందిన ఓ తల్లి తన కూతురికి కడుపునొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ పరీక్షించిన వైద్యులు.. బాలిక గర్భంతో ఉందని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా షాకైన తల్లి.. కూతురిని మందలించగా.. అసలు విషయం చెప్పింది. తుర్కపల్లి మండలం పెద్దతండాకు చెందిన శ్రీకాంత్(23) అనే యువకుడు ప్రేమ పేరుతో లైంగికదాడికి పాల్పడ్డాడని చెప్పింది.
దీంతో వెంటనే స్థానిక తుర్కపల్లి పీఎస్‌లో కేసు నమోదు చేశారు. యాదగిరిగుట్ట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎ.ఆంజనేయులు ఆధారాలు సేకరించి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. విచారణ పూర్తయిన తర్వాత IO ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. శుక్రవారం విచారణ జరిగిన భువనగిరి పోక్సో కోర్టు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన పోలీసులను రాచకొండ సీపీ చౌహాన్ అభినందించి, రివార్డులు అందజేశారు. నిందితుడు శ్రీకాంత్‌కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.2000 జరిమానా విధించినట్లు ఎస్ఐ రాఘవేంద్ర గౌడ్ తెలిపారు.