రాష్ట్రంలోని 2 లక్షల 67 వేల ఉద్యోగాలు ఖాళీ.. గణాంకాలు విడుదల చేసిన బక్కా జడ్సన్

ఉద్యోగాల భర్తీపై బక్కా జడ్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-14 11:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:మెగా డీఎస్సీ ద్వారా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 20 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మోసం చేసిందని వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బై పోల్ అభ్యర్థి బక్క జడ్సన్ ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఎన్నికల సంఘం తమ వెబ్ సైట్ లోనూ ఉంచిందని ఈ మేనిఫెస్టోను చూసే రాష్ట్రంలోని యువత కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపిస్తే ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై కేసులు నమోదు చేయాలని సీఈవో వికాస్ రాజ్ ను తాము ఇది వరకే కోరినట్లు చెప్పారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉద్యోగ ఖాళీలపై మీడియా సమావేశం నిర్వహించిన బక్కా జడ్సన్.. గత ఏడాది 31 డిసెంబర్ 2023 నాటికి 33 జిల్లాల్లో 2 లక్షల 67 వేల 316 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని వాటిని కొత్త ప్రభుత్వం భర్తీ చేయడానికి చొరవ చూపడం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయో గణాంకాలు విడుదల చేశారు. తెలంగాణ మేధావులు ఆలోచన చేయాలన్నారు. తెలంగాణ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉందన్నారు.

Tags:    

Similar News