సర్కార్ కీలక ఉత్తర్వులు.. గిరిజనులకు కేసీఆర్ దసరా గిప్ట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దసరా పండుగ సమీపిస్తోన్న తరుణంలో గిరిజనులకు శుభవార్త చెప్పింది. 10 శాతం రిజర్వేషన్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దసరా పండుగ సమీపిస్తోన్న తరుణంలో గిరిజనులకు శుభవార్త చెప్పింది. 10 శాతం రిజర్వేషన్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి విద్యా, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎస్టీ రిజర్వేషన్ అమలు కానున్నట్లు పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎస్టీలకు ఆరు శాతం రిజర్వేషన్ అమలు కాగా, దానిని పది శాతానికి పెంచారు. కాగా, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ప్రకటించిన సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో సైతం దీనిపై సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
Also Read: టీఆర్ఎస్ టు బీఆర్ఎస్.. పార్టీ నూతన అధ్యక్షుడు ఇతడే..?