‘ఇంటర్, సీబీఎస్ఈ పరీక్షలకు తెలంగాణ సిద్ధం’
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటర్, సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే సీబీఎస్ఈ, ఇంటర్ పరీక్షల నిర్వహణపై రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం ప్రభుత్వం సేకరించింది. దీంతో ఇంటర్, సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించడానికి తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. పరిస్థితులు చక్కబడితే జులై రెండో వారంలో ఇంటర్ పరీక్షల నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. పరీక్ష సమయం 3 గంటల నుండి గంటన్నరకి కుదించినట్లు […]
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటర్, సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే సీబీఎస్ఈ, ఇంటర్ పరీక్షల నిర్వహణపై రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం ప్రభుత్వం సేకరించింది. దీంతో ఇంటర్, సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించడానికి తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. పరిస్థితులు చక్కబడితే జులై రెండో వారంలో ఇంటర్ పరీక్షల నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. పరీక్ష సమయం 3 గంటల నుండి గంటన్నరకి కుదించినట్లు తెలిపిన తెలంగాణ సర్కార్, పరీక్షా విధానంలో మార్పులేదని, ప్రశ్నలు మాత్రం సగమే ఉంటాయని స్పష్టం చేసింది. ఆ సబ్టెక్టు పేపర్లలలో వచ్చిన మార్కులు రెట్టింపు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.