ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం

దిశ, వెబ్‌డెస్క్ : నైరుతి రుతుపవనాల ఆగమనంతో ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది.ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెల్లవారు జాము నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా హుజురాబాద్, జమ్మికుంటలో కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల చెట్లు విరిగిపడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విద్యుత్‌కు కూడా అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. వేములవాడ, శంకరపట్నం, సైదాపూర్‌లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుండగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరపిలేని […]

Update: 2021-06-08 20:30 GMT

దిశ, వెబ్‌డెస్క్ : నైరుతి రుతుపవనాల ఆగమనంతో ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది.ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెల్లవారు జాము నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా హుజురాబాద్, జమ్మికుంటలో కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల చెట్లు విరిగిపడినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా విద్యుత్‌కు కూడా అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. వేములవాడ, శంకరపట్నం, సైదాపూర్‌లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుండగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరపిలేని వర్షం కురుస్తోంది.

Tags:    

Similar News