తెలంగాణలో కరోనా కేసులు తగ్గాయి: డీహెచ్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో తాజాగా 3,614 కరోనా కేసులు నమోదయ్యాయని, ఇదే సమయంలో మరో 18 మంది మృతి చెందారన్నారు. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలోనే పాజిటివిటీ చాలా తగ్గిందని చెప్పారు. ఆస్పత్రుల్లో ఆక్సుపెన్సీ రేటు 54 శాతం నుంచి 39 శాతానికి తగ్గిందని డీహెచ్ స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు రాష్ట్ర వ్యాప్తంగా […]

Update: 2021-05-27 06:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో తాజాగా 3,614 కరోనా కేసులు నమోదయ్యాయని, ఇదే సమయంలో మరో 18 మంది మృతి చెందారన్నారు. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలోనే పాజిటివిటీ చాలా తగ్గిందని చెప్పారు. ఆస్పత్రుల్లో ఆక్సుపెన్సీ రేటు 54 శాతం నుంచి 39 శాతానికి తగ్గిందని డీహెచ్ స్పష్టం చేశారు.

ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు

రాష్ట్ర వ్యాప్తంగా 1200లకు పైగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స చేస్తున్నారని చెప్పిన డీహెచ్.. ఇందులో కొన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు కూడా వచ్చాయన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో బిల్లులపై 85, ప్రభుత్వ ఆదేశాలను పాటించడం లేదని 68 హాస్పిటల్స్‌పై ఫిర్యాదులు అందాయన్నారు. ఈ నేపథ్యంలోనే 88 ప్రైవేట్ హాస్పిటల్స్‌కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశామని చెప్పుకొచ్చారు. నోటీసులు అందుకున్న వారు 24 నుంచి 48 గంటల్లోపే సమాధానం చెప్పాలని ఆదేశించామని డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు.

Tags:    

Similar News