టెన్షన్‌లో తెలంగాణ పోలీసులు

దిశ, వెబ్ డెస్క్: కరోనా ఎవ్వరినీ వదలడంలేదు. ఫ్రంట్ లైన్ వారియర్స్ దాని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో పోలీసుల్లో భయాందోళనలు ప్రారంభమయ్యాయి. కంటికి కనిపించని ఈ మహమ్మారితో ముందువరుసలో నిలబడి యుద్ధం చేస్తున్నాము కానీ, అది ఎప్పుడు మాపై దాడి చేస్తోందో తెలియడంలేదన్న ఆందోళన పోలీసుల్లో కనిపిస్తోంది. తాజాగా తెలంగాణలోని పోలీస్ శాఖలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 4259 మంది పోలీసులకు కరోనా సోకింది. అయితే ఈ కేసుల్లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో […]

Update: 2020-08-13 23:03 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనా ఎవ్వరినీ వదలడంలేదు. ఫ్రంట్ లైన్ వారియర్స్ దాని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో పోలీసుల్లో భయాందోళనలు ప్రారంభమయ్యాయి. కంటికి కనిపించని ఈ మహమ్మారితో ముందువరుసలో నిలబడి యుద్ధం చేస్తున్నాము కానీ, అది ఎప్పుడు మాపై దాడి చేస్తోందో తెలియడంలేదన్న ఆందోళన పోలీసుల్లో కనిపిస్తోంది. తాజాగా తెలంగాణలోని పోలీస్ శాఖలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 4259 మంది పోలీసులకు కరోనా సోకింది. అయితే ఈ కేసుల్లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువమంది పోలీసులకు కరోనా సోకింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకి మొత్తం 39 మంది మృతిచెందారు. దీంతో పోలీస్ శాఖలో ఓ పక్క టెన్షన్ మొదలైంది. మరో పక్క కరోనాతో యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు.

Tags:    

Similar News