బంపర్ ఆఫర్.. 2 గంటల పనికి రూ. 25 వేలు..!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా, లాక్‌డౌన్ సమయంలో పనులు లేక ఇంట్లోనే ఉంటున్నారా.. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా.. ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే.. రోజుకీ కేవలం రెండు గంటలు పని చేస్తే చాలు.. నెలకు రూ. 25 వేల వరకు సంపాదించవచ్చు.. అంటూ సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకున్న కేటుగాళ్లు.. టెన్త్ క్వాలిఫికేషన్‌తోనే జాబ్స్, విద్యార్హత లేకున్నా ఉద్యోగాలు, మంచి జీతం అంటూ మస్కా కొడుతున్నారు. ఇందుకోసం ఫేక్ కంపెనీల పేరుతో […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా, లాక్‌డౌన్ సమయంలో పనులు లేక ఇంట్లోనే ఉంటున్నారా.. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా.. ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే.. రోజుకీ కేవలం రెండు గంటలు పని చేస్తే చాలు.. నెలకు రూ. 25 వేల వరకు సంపాదించవచ్చు.. అంటూ సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకున్న కేటుగాళ్లు.. టెన్త్ క్వాలిఫికేషన్‌తోనే జాబ్స్, విద్యార్హత లేకున్నా ఉద్యోగాలు, మంచి జీతం అంటూ మస్కా కొడుతున్నారు. ఇందుకోసం ఫేక్ కంపెనీల పేరుతో ప్లామ్‌ప్లేట్స్, ప్రకటనల రూపంలో మొబైల్ ఫోన్స్‌కు పంపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రకటనలకు ఆకర్శితులై స్పందించిన అమయాకుల నుంచి జాయినింగ్, రిజిస్ట్రేషన్, కంపెనీ, ట్రైనింగ్ ఫీజులు అంటూ భారీగా వసూళ్లు చేస్తున్నారు. అనంతరం ముఖం చాటేస్తున్నారు. ఇటువంటి మోసాలను గురి కావొద్దని మహబూబాబాద్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.