బడ్జెట్ సమావేశాలు.. అసెంబ్లీలో రూల్స్ బ్రేక్ చేసిన ఎమ్మెల్యేలు

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కోవిడ్​ నిబంధనలను వదిలేశారు. కరోనా సెకండ్​ వేవ్​ సీరియస్‌గా ఉందంటూ ఓవైపు హెచ్చరిస్తున్నా ఎమ్మెల్యేలే పాటించడం లేదు. అసెంబ్లీ సమావేశాల్లో కోవిడ్​ నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నామంటూ చెబుతున్న ప్రభుత్వం చిన్న చిన్న అంశాల్లో కఠినతరం చేసింది. మీడియాకు ఆంక్షలు విధించింది. దూరం పాటించాలంటూ పోలీసులతో చెప్పిస్తోంది. కానీ ఎమ్మెల్యేలు మాత్రం హౌజ్​లోకి వెళ్లగానే చేతులు చేతులు… భుజాలు భుజాలు కలుపుకుంటూ రూల్స్​ను బ్రేక్​ చేస్తున్నారు. బడ్జెట్​సెషన్​ సందర్భంగా అసెంబ్లీలో […]

Update: 2021-03-18 08:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కోవిడ్​ నిబంధనలను వదిలేశారు. కరోనా సెకండ్​ వేవ్​ సీరియస్‌గా ఉందంటూ ఓవైపు హెచ్చరిస్తున్నా ఎమ్మెల్యేలే పాటించడం లేదు. అసెంబ్లీ సమావేశాల్లో కోవిడ్​ నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నామంటూ చెబుతున్న ప్రభుత్వం చిన్న చిన్న అంశాల్లో కఠినతరం చేసింది. మీడియాకు ఆంక్షలు విధించింది. దూరం పాటించాలంటూ పోలీసులతో చెప్పిస్తోంది. కానీ ఎమ్మెల్యేలు మాత్రం హౌజ్​లోకి వెళ్లగానే చేతులు చేతులు… భుజాలు భుజాలు కలుపుకుంటూ రూల్స్​ను బ్రేక్​ చేస్తున్నారు. బడ్జెట్​సెషన్​ సందర్భంగా అసెంబ్లీలో సీటింగ్​ గ్యాప్​ను ఏర్పాటు చేశారు.

కరోనా నేపథ్యంలో ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఇదే పాటిస్తున్నారు. కార్యాలయాల్లో కూడా ఇవే రూల్స్​. కానీ అసెంబ్లీ హాల్​లో మంత్రి హరీష్​రావు బడ్జెట్​ ప్రసంగం చదువుతున్న సమయంలో ఎమ్మెల్యేలు దగ్గరకు చేరిపోయారు. సీట్లకు మధ్య గ్యాప్​ ఇస్తూ ఏర్పాట్లు చేసినా నో సిట్టింగ్​ సీట్లలో కూర్చుని ముచ్చట్లు పెట్టారు. చాలా మంది ఎమ్మెల్యేలు నో సిట్టింగ్​ సీట్లలోనే అసీనులయ్యారు. ఎమ్మెల్యేలతో మాట్లాడుకుంటూ కోవిడ్​ రూల్స్​కు బ్రేక్​ వేశారు. అసెంబ్లీలోనే రూల్స్​ పాటించడం లేదంటూ అధికారులు సైతం అసహనం వ్యక్తం చేశారు. కానీ ఎమ్మెల్యేలు కదా… అవేమీ పట్టించుకోలేదు.

Tags:    

Similar News