తెలంగాణ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. జల వివాదాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు విమర్శల దాడికి దిగుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత ఎస్వీ మోహన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ మంత్రుల విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి అని హెచ్చరించారు. తెలంగాణ మంత్రులు అనవసరంగా సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ ప్రాంతానికి […]

Update: 2021-07-03 11:31 GMT

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. జల వివాదాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు విమర్శల దాడికి దిగుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత ఎస్వీ మోహన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ మంత్రుల విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి అని హెచ్చరించారు. తెలంగాణ మంత్రులు అనవసరంగా సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసింది మాజీ సీఎం చంద్రబాబేనని ఆరోపించారు.

చంద్రబాబు జీఓ 69 తెచ్చి రాయలసీమకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. తెలంగాణ జెన్‌కో 800 అడుగులు వద్ద విద్యుత్తు ఉత్పత్తి చేయడం సరికాదన్నారు. అలాగే అనుమతులు లేకుండా 254 టీఎంసీలు నీరు తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేశఆరు. ఈ జలవివాదాలపై కేంద్రానికి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం విచారకరమన్నారు. తెలంగాణ నుంచి ఫిర్యాదు వస్తే వెంటనే స్పందిస్తున్న కేంద్రం తమ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాయలసీమకు అన్యాయం జరిగితే సీమ ప్రజలు ఏం చేయడానికైనా సిద్ధమని ఎస్వీ మోహన్‌రెడ్డి హెచ్చరించారు.

Tags:    

Similar News