ఓటరు నమోదులోనూ నాయకుల పోటీ
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎన్నికల ప్రచారంలోనే కాదు.. ఓటర్ల నమోదులోనూ నాయకులు, ప్రజాప్రతినిధులు పోటీపడుతున్నారు. మరో వైపు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఓటరుగా నమోదు చేసుకుంటూ ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకుంటున్నారు. దీంతో ఓటరు నమోదులో ఎన్నికల కోలాహలం కనుబడుతోంది. బరిలో ప్రముఖుల పేర్లు వినిపిస్తుండటంతో తీవ్ర పోటీ నెలకొనే అవకాశముంది. ఇందుకు తగ్గట్టుగానే ఆయా పార్గీల నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో మునిగిపోయారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. నవంబర్ […]
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎన్నికల ప్రచారంలోనే కాదు.. ఓటర్ల నమోదులోనూ నాయకులు, ప్రజాప్రతినిధులు పోటీపడుతున్నారు. మరో వైపు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఓటరుగా నమోదు చేసుకుంటూ ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకుంటున్నారు. దీంతో ఓటరు నమోదులో ఎన్నికల కోలాహలం కనుబడుతోంది. బరిలో ప్రముఖుల పేర్లు వినిపిస్తుండటంతో తీవ్ర పోటీ నెలకొనే అవకాశముంది. ఇందుకు తగ్గట్టుగానే ఆయా పార్గీల నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో మునిగిపోయారు.
పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. నవంబర్ 6వ తేదీ ఓటర్ల నమోదు అవకాశముండటంతో ఈ కార్యక్రమాన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎవరికి వారు ఇప్పటి నుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మొత్తం 74 తహసీల్దార్ కార్యాలయాల్లో పట్టభ్రదులు తమ ఓట్టు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికే జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మారెడ్డి తమ ఓట్టు హక్కు కోసం సంబంధిత తహసిల్దార్ కార్యాలయాలలో దరఖాస్తు చేసుకున్నారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం ఓటర్ల నమోదుపై ప్రత్యేక ద్రుష్టి కేంద్రీకరించాలని సూచిస్తున్నారు.
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. డిసెంబర్ 6న ముసాయిదా ఓటర్ జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసి, డిసెంబర్ 31 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించనుంది. అలాగే జనవరి 12 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిష్కరించి జనవరి 18న తుది జాబితాను విడుదల చేయనుంది.
ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పార్టీలు..
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల నమోదు దగ్గరి నుంచి ప్రతి విషయంలోనూ ఆయా పార్టీల నాయకులకు, కార్యకర్తలకు అధిష్టానం, ముఖ్య నాయకుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఇప్పటికే ఓటర్ల నమోదు కార్యక్రమాలపై జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆయా మండలాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. దీంతో ఎన్నికల మాట ఎలా ఉన్నా ఇప్పటి నుంచే జిల్లాలో రాజకీయ కోలాహలం మొదలైంది. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, బీజేపీ ప్రస్తుత ఎమ్మెల్సీ రాంచందర్‌రావు నియోజకవర్గంలో సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఓటర్లు పెరిగే అవకాశం..
గతంతో పోలీస్తే ఈ సారీ ఓటర్ల నమోదు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈ సారి 20శాతం వరకు ఓటర్ల నమోదు పెరిగే అవకాశముంది. 2014 ఎన్నికల సమయం నాటికి మూడు జిల్లాల పరిధిలో 2,96,318 మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా అందులో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి సుమారు 70,500మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే గ్రామాల వారీగా ఆయా రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లను చైతన్య పరుస్తుండటంతో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశముంది.
నిరాశ పరుస్తున్న ఓటింగ్ శాతం..
ఓటర్ల నమోదు ప్రక్రియ ఎలా ఉన్నా చివరకు ఓటింగ్ విషయానికి వచ్చే సరికి మాత్రం పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. గత ఎన్నికల్లో 2,96,318 మంది ఓటర్లలో కేవలం 1,13,380 ఓట్లు మాత్రమే (39శాతం) పోలయ్యాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే మొత్తం 70,500 ఓట్లలో కేవలం 37 వేలు మాత్రమే పోలవ్వగా.. అందులో 15వేల ఓట్లు కేవలం మహబూబ్‌నగర్ పట్టణంలోనే పోలయ్యాయి.
ఈసారి బరిలో ప్రముఖులు?
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ నమోదు కార్యక్రమం ప్రారంభంతోనే జిల్లాలో అశావహుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుండి పోటీచేసేందుకు ప్రముఖులు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీ చేసేందుకు సిద్ధం అవుతుండగా బీజేపీ సిట్టింగ్ స్థానం కావడంతో మరోసారి ప్రస్తుత ఎమ్మెల్సీ రాంచందర్‌రావు సైతం బరిలో నిలివనున్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఫొఫెసర్ కోదండరాం సైతం బరిలో నిలవనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డితో పాటు ఏఐసీసీ కార్యదర్శులు, మాజీ ఎమ్మెల్యేలు వంశీచంద్‌రెడ్డి, సంపత్ కుమార్, పార్టీ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్, హర్షవర్దన్‌రెడ్డి సైతం టికెట్ ఆశిస్తున్నారు.
గెలుపు ఎవరిది?
1985లో నాటి సీఎం ఎన్‌టీ.రామారావు శాసన మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2007లో అప్పటి సీఎం వైఎస్. రాజశేఖర్ రెడ్డి శాసనమండలిని పునరుద్దరించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గం నుంచి 2007లో పొత్తులో భాగంగా ఈ స్థానంలో కాంగ్రెస్, సీపీఎం తరపున డాక్టర్ నాగేశ్వర్ పోటీ చేసి విజయం సాధించారు. 2009లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన నాగేశ్వర్ కు కాంగ్రెస్, టీఆర్ఎస్ మద్దతివ్వడంతో బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావు ఆయన విజయం సాధించారు. 2015లో డా.నాగేశ్వర్ ఎన్నికల నుంచి తపుకోవడంతో.. టీఆర్ఎస్ నుంచి ఉద్యోగ సంఘాల నాయకుడు దేవిప్రసాద్ పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి రాంచందర్ రావు పోటీ చేశారు. ఈ పోటీలో టీఆర్ఎస్ అభ్యర్థి దేవిప్రసాద్‌పై బీజేపీ అభ్యర్థి రాంచందర్ 13,318 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ సారీ పార్టీల నుంచి ఎవరెవరు పోటీచేస్తున్నారన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. మరీ ఈ సారీ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు? ఏ పార్టీని గెలిపిస్తారో వేచి చూడాలి.