బయటకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోండి
దిశ, క్రైమ్ బ్యూరో: ప్రజలు కొవిడ్-19 బారిన పడకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడు ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మహమూద్ అలీ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ పరిస్థితుల్లో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కార్యాలయాలకు, వివిధ సంస్థలకు, ఆస్పత్రులకు, దుకాణాలకు వెళ్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లే సమయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా పిల్లలు, వృద్దులు అత్యవసరం అయితే తప్ప బయటకు […]
దిశ, క్రైమ్ బ్యూరో: ప్రజలు కొవిడ్-19 బారిన పడకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడు ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మహమూద్ అలీ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ పరిస్థితుల్లో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కార్యాలయాలకు, వివిధ సంస్థలకు, ఆస్పత్రులకు, దుకాణాలకు వెళ్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లే సమయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా పిల్లలు, వృద్దులు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ హ్యాండ్ శానిటైజర్స్, మాస్క్‌లను ఉపయోగించాలని, భౌతిక వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు.