వేసవి సెలవులు రద్దు.. హైకోర్టు కీలక నిర్ణయం
దిశ, న్యూస్బ్యూరో: తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ బుధవారం హైకోర్టు రిజిస్ట్రర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్ నివారణకు చేపట్టిన చర్యలతో కోర్టు వ్యవహారాలపైనా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో కోర్టు క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించిన వేసవి సెలవులను రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా, ఇతర కోర్టులు, ట్రైబ్యునళ్లు, హైకోర్టు లీగల్ సర్వీసులకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. tags: Lockdown, […]
దిశ, న్యూస్బ్యూరో: తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ బుధవారం హైకోర్టు రిజిస్ట్రర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్ నివారణకు చేపట్టిన చర్యలతో కోర్టు వ్యవహారాలపైనా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో కోర్టు క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించిన వేసవి సెలవులను రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా, ఇతర కోర్టులు, ట్రైబ్యునళ్లు, హైకోర్టు లీగల్ సర్వీసులకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి.
tags: Lockdown, Corona, Highcourt, Law, Legal, telangana, justice