బ్రేకింగ్: పేద విద్యార్థుల కోసం గవర్నర్ కీలక నిర్ణయం

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని పేద విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు పొందలేకపోతున్నారని గవర్నర్ తమిళిసైకి వచ్చిన ఫిర్యాదులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఐటీ కంపెనీల్లో మూలుగుతున్న పాత కంప్యూటర్లు ఇస్తే పేద, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు ఇస్తామని ప్రకటించారు. దీనిపై తమిళిసై చర్యలు చేపట్టారు. ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌లు విరాళంగా ఇవ్వాలని దాతలకు బుధవారం గవర్నర్‌ పిలుపునిచ్చారు. అంతేగాకుండా, నిరుపయోగంగా ఉన్న ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు ఇవ్వాలని ఐటీ కంపెనీలు, సంస్థలకు మరోసారి గవర్నర్‌ విజ్ఞప్తి చేశారు. ఇందుకు […]

Update: 2021-10-27 09:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని పేద విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు పొందలేకపోతున్నారని గవర్నర్ తమిళిసైకి వచ్చిన ఫిర్యాదులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఐటీ కంపెనీల్లో మూలుగుతున్న పాత కంప్యూటర్లు ఇస్తే పేద, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు ఇస్తామని ప్రకటించారు. దీనిపై తమిళిసై చర్యలు చేపట్టారు. ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌లు విరాళంగా ఇవ్వాలని దాతలకు బుధవారం గవర్నర్‌ పిలుపునిచ్చారు. అంతేగాకుండా, నిరుపయోగంగా ఉన్న ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు ఇవ్వాలని ఐటీ కంపెనీలు, సంస్థలకు మరోసారి గవర్నర్‌ విజ్ఞప్తి చేశారు. ఇందుకు రాజ్‌భవన్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. విరాళం ఇచ్చే దాతలు 94900 00242 నంబర్‌కు సంప్రదించాలని, లేకపోతే rajbhavan-hyd@gov.in మెయిల్‌కు వివరాలు తెలియజేయాలని కోరారు.

Tags:    

Similar News