వారి అభ్యున్నతికే అధిక ప్రాధాన్యత- మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: ఆదివాసీల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిపుత్రులకు మంత్రి అల్లోల శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారని, ప్రత్యేకంగా గిరిజనులకు ప్రాధాన్యతనిస్తున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజనుల వెనుకబాటును తొలగించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ఆదివాసులకు అన్ని […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఆదివాసీల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిపుత్రులకు మంత్రి అల్లోల శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారని, ప్రత్యేకంగా గిరిజనులకు ప్రాధాన్యతనిస్తున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజనుల వెనుకబాటును తొలగించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ఆదివాసులకు అన్ని మౌళికవసతులు కల్పించుటకు ప్రభుత్వం కోట్లాది రూపాయాల నిధులు మంజూరు చేస్తుందని వెల్లడించారు.
ప్రత్యేకించి ప్రతి తండానూ గ్రామ పంచాయతీగా గుర్తించి.. ‘మా తండాలో మా రాజ్యం’ అనే గిరిజన ప్రజల కలను సాకారం చేసిందని వెల్లడించారు. అటవీ హక్కుల చట్టం అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, అటవీ ఉత్పత్తులపై ఆధారపడ్డ అడవి బిడ్డలకు స్వావలంబన ప్రసాదించే దిశగా అడుగులు వేస్తున్నదని చెప్పారు. గిరిజన విద్యాభివృద్ధి కోసం రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ప్రారంభించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. ఇక దక్షిణ భారత కుంభమేళాగా చెప్పుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఉనికిగా చెప్పుకునేలా అత్యంత ఘనంగా నిర్వహిస్తోందన్నారు.
ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీకైన కొమురం భీమ్ వర్ధంతిని అధికారికంగా, ఘనంగా జరపడంతో పాటు జోడేఘాట్ అభివృద్దికి రూ.25 కోట్లు, నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం కోసం రూ. 7 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. కేస్లాపూర్‌లోని నాగోబా జాతర ఉత్సవాలకు ప్రతి ఏటా ప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. నాగోబా ఆలయ విస్తరణ, దర్భార్ నిర్మాణం, రోడ్ల అభివృద్దికి నిధులు కేటాయించిందని పేర్కొన్నారు.