తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: వ్యాక్సినేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28 నుంచి సూపర్ స్ప్రెడర్స్ అందరికీ ఉచిత వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. 25 నుంచి 3 లక్షల మంది వరకు సూపర్ స్ప్రెడర్స్ ఉన్నట్టు అంచనా వేసిన అధికారులు.. ఇందులో భాగంగా తొలుత జీహెచ్ఎంసీ పరిధిలోని ఆటోడ్రైవర్లకు టీకా వేయనున్నారు. ఎల్పీజీ డెలివరీ స్టాఫ్, రేషన్ డీలర్స్, పెట్రోల్ పంప్ వర్కర్స్, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లలో వ్యాక్సిన్ […]
దిశ, వెబ్‌డెస్క్: వ్యాక్సినేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28 నుంచి సూపర్ స్ప్రెడర్స్ అందరికీ ఉచిత వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. 25 నుంచి 3 లక్షల మంది వరకు సూపర్ స్ప్రెడర్స్ ఉన్నట్టు అంచనా వేసిన అధికారులు.. ఇందులో భాగంగా తొలుత జీహెచ్ఎంసీ పరిధిలోని ఆటోడ్రైవర్లకు టీకా వేయనున్నారు. ఎల్పీజీ డెలివరీ స్టాఫ్, రేషన్ డీలర్స్, పెట్రోల్ పంప్ వర్కర్స్, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లలో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు 4.90 లక్షల డోసులను సిద్ధం చేశారు. ఈ డోసులను సూపర్ స్ప్రెడర్స్‌కు ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది.