గుడ్‌న్యూస్: జీతాలు పెరుగుతున్నాయి.. కానీ..!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 30శాతం ఫిట్ మెంట్ తో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. గతంలో ఇచ్చిన 43 శాతం ఫిట్మెంట్కంటే ఈ సారి ఎక్కువగా పెరుగుతున్నాయి. కనిష్టంగా రూ.3,500 నుంచి రూ. 4వేల వరకు పెరిగింది. దీనితో పాటు డీఏ కూడా కలిసి వస్తోంది. ఫలితంగా కనీస వేతనం రూ.20 వేలు దాటుతోంది. అయితే బేసిక్వేతనం పెరుగుతున్నా… అలవెన్స్కొంత మేరకు తగ్గుతోంది. ఉద్యోగులకు వేతన సవరణ జరగడంతో పీఆర్సీపై లెక్కలు వేశారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 30శాతం ఫిట్ మెంట్ తో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. గతంలో ఇచ్చిన 43 శాతం ఫిట్మెంట్కంటే ఈ సారి ఎక్కువగా పెరుగుతున్నాయి. కనిష్టంగా రూ.3,500 నుంచి రూ. 4వేల వరకు పెరిగింది. దీనితో పాటు డీఏ కూడా కలిసి వస్తోంది. ఫలితంగా కనీస వేతనం రూ.20 వేలు దాటుతోంది. అయితే బేసిక్వేతనం పెరుగుతున్నా… అలవెన్స్కొంత మేరకు తగ్గుతోంది. ఉద్యోగులకు వేతన సవరణ జరగడంతో పీఆర్సీపై లెక్కలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై అదనంగా రూ.10వేల కోట్ల మేర భారంపడనుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఒక్కో ఉద్యోగికి ఎంత మేర పెరుగుతుందనే లెక్కలు కూడా దాదాపుగా తేల్చారు. దీంతో కనీసం వేతనం రూ.20,851 నుంచి మొదలుకానుంది. ఇక గరిష్టంగా రూ.1.78 లక్షలకు చేరుతోంది.
ప్రస్తుతం ఫిట్మెంట్తో పాటు డీఏ కూడా ఉద్యోగుల వేతనంలో జమ కానుంది. 2018 జూలైలో డీఏ 30.392 శాతం కలుపుకుని వేతన సవరణ చేశారు. ఈ లెక్కన ఉద్యోగులకు ఒకేసారి రూ.ఏడువేల వరకు జీతాలు పెరగనున్నాయి. ఒక ఉద్యోగి కనీస వేతనం రూ.13వేలు అనుకుంటే డీఏ 30.392 శాతం కలుపుకుంటే రూ.3,951, ఫిట్మెంట్30 శాతం రూ.3,900 వేతనంలో జమ కానుంది. దీంతో సదరు ఉద్యోగి కనీస వేతనం రూ. 20,851కి చేరుతోంది. ఇలా గరిష్టంగా సీనియర్ఉద్యోగి బేసిక్‌పే రూ. 1,10,850గా ఉంటే డీఏ రూ.33,690తో పాటు 30 శాతం ఫిట్మెంట్రూ.33,255 చొప్పున కలవనుంది. దీంతో గరిష్ట వేతనం రూ.1,77,795కు చేరబోతుంది.
తగ్గనున్న అలవెన్స్‌లు
ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో బేసిక్ పేలో ఫిట్మెంట్తో పాటు డీఏ కలుపుకుని 60 శాతం మేరకు పెరుగుతున్నాయి. ఈ లెక్కన రూ.13వేల వేతనం ఉంటే డీఏను విలీనం చేయడంతో రూ.20వేలకు చేరుతోంది. కానీ గతంలో బేసిక్ వేతనంమీద ఇచ్చే 40 శాతం డీఏ, 30శాతం హెచ్ఆర్ఏ ఈసారి తగ్గనుంది. అలవెన్స్ దాదాపు 30శాతం మేర తగ్గనుందని అంచనా వేస్తున్నారు. డీఏను బేసిక్‌లో మెర్జ్చేయడంతో… కొత్త బేసిక్ పేప్రకారం డీఏ పర్సంటేజీ తగ్గుతుంది.
అయితే, కొత్త జీతాన్ని బట్టి ఇకపైన అందుకునే డీఏ మాత్రం గతంలో ఉన్నదానికంటే తక్కువగానే ఉంటుంది. వారి వేతనం శ్లాబ్‌లో తేడా రావడమే ఇందుకు కారణం. అంతేకాకుండా హెచ్ఆర్ఏను కూడా తగ్గించారు. హైదరాబాద్‌లోనే 24 శాతానికి తగ్గిస్తున్నారు. దీని ప్రకారం బేసిక్వేతనం పెరుగుతున్నా… అలవెన్స్ మాత్రం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. కింది పేర్కొన్న పట్టికలో కొన్ని వేతన శ్లాబ్‌లు మాత్రమే.. ఇంకా సుమారు 60 రకాల శ్లాబ్‌లు ఉన్నా వాటిని పేర్కొనలేదు.
వేతనాలు పెంపు ఇలా..(రూపాయల్లో)
బేసిక్‌పే (కనీస వేతనం) | డీఏ (30.392శాతం) | ఫిట్మెంట్(30శాతం) | మొత్తం |
13,000 | 3,951 | 3,900 | 20,851 |
14,170 | 4,307 | 4,251 | 22,728 |
15030 | 4,568 | 4,509 | 24,107 |
16400 | 4,984 | 4,920 | 26,304 |
17,380 | 5,282 | 5,214 | 27,876 |
18,400 | 5,592 | 5,520 | 29,512 |
20,050 | 6,094 | 6,015 | 32,159 |
25,140 | 7,641 | 7,542 | 40,323 |
30,580 | 9,294 | 9,174 | 49,048 |
35,120 | 10,674 | 10,536 | 56,330 |
40,270 | 12,239 | 12,081 | 64,590 |
46,060 | 13,999 | 13,818 | 73,877 |
51,230 | 15,570 | 15,369 | 82,169 |
55,410 | 16,840 | 16,623 | 88,873 |
61,450 | 18,676 | 18,435 | 98,561 |
71,510 | 21,733 | 21,453 | 1,14,696 |
80,930 | 24,596 | 24,27 | 1,29,805 |
84,970 | 25,824 | 25,491 | 1,36,285 |
89,290 | 27,137 | 26,787 | 1,43,214 |
91,450 | 27,793 | 27,435 | 1,46,678 |
1,00,770 | 30,626 | 30,231 | 1,61,627 |
1,05,810 | 32,158 | 31,743 | 1,69,711 |
1,10,850 | 33,690 | 33,255 | 1,77,795 |