మావోయిస్టులను సహించేది లేదు: డీజీపీ

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టుల కదలికలపై అప్రమత్తంగా ఉన్నామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్‌లో సరిహద్దు జిల్లాల ఎస్పీలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంగీ అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్‌పై చర్చించారు. అటవీ ప్రాంతంలో 500 మంది పోలీసులతో కూంబింగ్ నిర్వహిస్తున్నామని డీజీపీ చెప్పారు. మావోయిస్టులకు ఏజెన్సీ ప్రజలు సహకరించొద్దని ఆయన సూచించారు. ఆడెళ్లు అలియాస్ భాస్కర్ దళం సభ్యుల వివరాలు తెలిస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు […]

Update: 2020-07-17 04:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టుల కదలికలపై అప్రమత్తంగా ఉన్నామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్‌లో సరిహద్దు జిల్లాల ఎస్పీలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంగీ అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్‌పై చర్చించారు. అటవీ ప్రాంతంలో 500 మంది పోలీసులతో కూంబింగ్ నిర్వహిస్తున్నామని డీజీపీ చెప్పారు. మావోయిస్టులకు ఏజెన్సీ ప్రజలు సహకరించొద్దని ఆయన సూచించారు. ఆడెళ్లు అలియాస్ భాస్కర్ దళం సభ్యుల వివరాలు తెలిస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు మావోయిస్టుల ఎత్తుగడలు మంచిదికాదన్నారు. వారి చర్యలను సహించేది లేదని.. త్వరలోనే మావోయిస్టులను పట్టుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు.

Tags:    

Similar News