గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం : ఉత్తమ్

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. మూడు వ్యవసాయ బిల్లుల విషయంలో ఏఐసీసీ పిలుపు మేరకు క్షేత్రస్థాయి ఉద్యమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రైతులకు నష్టం కలిగించే విధంగా, కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేవిధంగా ఈ బిల్లు ఉందని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. మార్కెట్ బయట వ్యవసాయ ఉత్పత్తులను […]

Update: 2020-09-26 23:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. మూడు వ్యవసాయ బిల్లుల విషయంలో ఏఐసీసీ పిలుపు మేరకు క్షేత్రస్థాయి ఉద్యమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రైతులకు నష్టం కలిగించే విధంగా, కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేవిధంగా ఈ బిల్లు ఉందని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. మార్కెట్ బయట వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో వ్యాపారులపై నియంత్రణ ఉందని ఉత్తమ్ తెలిపారు. ఈ నెల 28న ప్రదర్శన నిర్వహించి, గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

ఈ బిల్లుల మూలంగా బ్లాక్ మార్కెట్ పెరిగి, నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతాయని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మనిక్కం ఠాగూర్ పాల్గొని మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో నిరంతర ఉద్యమాలు చేయాలని అన్నారు. అంతా కలిసి టీం వర్క చేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వం, వరుస పోరాటాలు, గ్రాడ్యుయేట్ ఎన్నికలు, గ్రేటర్, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కార్పొరేషన్ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చ జరిపారు.

Tags:    

Similar News