మరికాసేపట్లో కేబినెట్ మీటింగ్.. నిర్ణయాలు ఏంటి..?

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కరోనా ఉధృతి, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర మంత్రివర్గం మరికొద్దిసేపట్లో సమావేశం కానుంది. ప్రగతిభవన్‌‌లో సీఎం కేసీఆర్​నేతృత్వంలో మంత్రిమండలి భేటీ అవుతోంది. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్​ పెట్టాలని వైద్యరంగంతో పాటు పలు వర్గాల నుంచి డిమాండ్​ ఉంది. కానీ, లాక్‎డౌన్​ అవసరం లేదంటూ సీఎం కేసీఆర్​, సీఎస్ సోమేశ్​ కుమార్​ పలుమార్లు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా ప్రభుత్వానికి డెడ్​లైన్​ విధించింది. ఈ పరిణామాల […]

Update: 2021-05-11 01:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కరోనా ఉధృతి, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర మంత్రివర్గం మరికొద్దిసేపట్లో సమావేశం కానుంది. ప్రగతిభవన్‌‌లో సీఎం కేసీఆర్​నేతృత్వంలో మంత్రిమండలి భేటీ అవుతోంది. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్​ పెట్టాలని వైద్యరంగంతో పాటు పలు వర్గాల నుంచి డిమాండ్​ ఉంది. కానీ, లాక్‎డౌన్​ అవసరం లేదంటూ సీఎం కేసీఆర్​, సీఎస్ సోమేశ్​ కుమార్​ పలుమార్లు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా ప్రభుత్వానికి డెడ్​లైన్​ విధించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రి మండలి సమావేశం అవుతోంది. దీంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.

రాష్ట్రంలో లాక్‌డౌన్​ ఉంటుందని కొన్ని వర్గాలు, ఉండదంటూ మరికొన్ని వర్గాలు ఇప్పటికే చర్చిస్తున్నాయి. ఈ నెల 15 తర్వాత నుంచి లాక్​డౌన్​ ఉంటుందంటున్నారు. ఇవ్వాళ మరికొద్దిసేపట్లోనే జరిగే కేబినెట్‌ మీటింగ్‌లో వీటన్నింటిపైనా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మరోవైపు 16 మంది మంత్రులతో రాష్ట్ర కేబినెట్​ ఈ రోజు జరుగనుంది. ఈటల మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్‌ను ఇప్పటికే బర్తరఫ్​ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ కేబినెట్​ భేటీ గత ఏడాది నవంబర్​ 13న నిర్వహించారు. జీహెచ్‌‌ఎంసీ ఎన్నికలకు ముందు నిర్వహించిన ఈ కేబినెట్​ భేటీలో అప్పుడు గ్రేటర్‌కు వరాలు కురిపించారు. ఇప్పుడు కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ప్రధాన చర్చగా మారింది.

Tags:    

Similar News