తెలంగాణ బీజేపీ నేతలు అరెస్ట్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదనే మనస్తాపంతో కేయూలో పురుగుల మందు సునీల్ నాయక్ అనే యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అతడి మృతదేహాన్ని అమరవీరుల స్థూపం వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్, బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ భాను ప్రకాష్ మాట్లాడుతూ… నిరుద్యోగుల పట్ల […]
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదనే మనస్తాపంతో కేయూలో పురుగుల మందు సునీల్ నాయక్ అనే యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అతడి మృతదేహాన్ని అమరవీరుల స్థూపం వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్, బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ భాను ప్రకాష్ మాట్లాడుతూ… నిరుద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పరిధిలోని నాలుగు జిల్లాల్లోని యువ మోర్చా నాయకులు మాత్రం ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తారని చెప్పారు.
ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకుని నోటిఫికేషన్లు జారీ చేయాలని, లేకపోతే రాబోయే రోజుల్లో బీజేవైఎం తరఫున పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.