నిర్భందంలో తెలంగాణ.. సరిహద్దులన్నీ క్లోజ్
దిశ, తెలంగాణ బ్యూరో : రోజురోజుకీ పెరుగుతోన్న కరోనా కేసుల నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ పాటించగా… తెలంగాణ మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కేవలం నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలోనూ లాక్‌డౌన్ విధిస్తారా.? అన్న చర్చకు పుల్‌స్టాప్ పెడుతూ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని సీఎం ప్రకటించారు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న సరిహద్దు రాష్ట్రాలన్ని లాక్‌డౌన్ విధించుకున్నాయి. కేంద్రం కూడా లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయా రాష్ట్రాల్లో […]
దిశ, తెలంగాణ బ్యూరో : రోజురోజుకీ పెరుగుతోన్న కరోనా కేసుల నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ పాటించగా… తెలంగాణ మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కేవలం నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలోనూ లాక్‌డౌన్ విధిస్తారా.? అన్న చర్చకు పుల్‌స్టాప్ పెడుతూ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని సీఎం ప్రకటించారు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న సరిహద్దు రాష్ట్రాలన్ని లాక్‌డౌన్ విధించుకున్నాయి. కేంద్రం కూడా లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయా రాష్ట్రాల్లో పరిస్థితుల ప్రకారం రాష్ట్రాలే నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం తెలంగాణ మాత్రమే ఏకాకిగా మిగిలింది. కేంద్ర సూచనలను పాటిస్తోంది.
చుట్టూ ఆంక్షలు
తెలంగాణ చుట్టూరా ఉన్న రాష్ట్రాలు ఆంక్షలు పెట్టుకున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌కు కళ్లెం వేయడానికి దేశవ్యాప్త లాక్‌డౌన్ లేకున్నా, వైరస్ ఉధృతిని బట్టి ఆయా రాష్ట్రాలు పాటిస్తున్నా… దక్షిణాదిలో తెలంగాణ రాష్ట్రం దిగ్బంధంలో చిక్కుకుంది. సరిహద్దు రాష్ట్రాలన్ని లాక్‌డౌన్ విధించాయి. తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్ విధించనప్పటికీ అక్కడ 18 గంటల పాటు కర్య్ఫూ కొనసాగుతోంది. పక్కనున్న కర్ణాటక ఈ నెల 10 నుంచి 24వ తేదీ వరకు లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు సీఎం బీఎస్ యాడ్యూరప్ప ప్రకటించారు.
అత్యధిక కేసులతో అల్లాడుతున్న మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ లాంటి ఆంక్షలనే విధించింది. ఏప్రిల్ 15 నుంచి అమల్లో ఉన్న కఠిన ఆంక్షలు ఈ నెల 15 వరకు కొనసాగనున్నాయి. లాక్‌డౌన్‌తో ఇప్పుడు కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మే 5 నుంచి మొదలైన లాక్‌డౌన్ 15వ తేదీ వరకు కొనసాగనుంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సంబంధాలున్న ఒడిశాలోనూ కేసులు పెరుగుతుండటంతో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం 14 రోజుల లాక్‌డౌన్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5 నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది.
రాకపోకలన్నీ బంద్
సరిహద్దుల్లోని రాష్ట్రాలు లాక్‌డౌన్, అలాంటి కఠిన ఆంక్షల్లో ఉండటంతో రాష్ట్రం నుంచి రాకపోకలన్నీ ఆగిపోయాయి. వాహనాలకు అనుమతివ్వడం లేదు. మన దగ్గర నుంచి ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే సర్వీసులు కూడా ఆపేశారు. సరిహద్దుల్లో మన రాష్ట్రం నుంచి ఎవరినీ అడుగు పెట్టనీయడం లేదు. కొన్నిచోట్ల తప్పనిసరిగా వెళ్తే… 15 రోజులు క్వారంటైన్లో ఉంచుతున్నారు.
హస్తినకు కట్
దేశ రాజధానితో సంబంధాలు తెగిపోయినట్టే అనిపిస్తోంది. ఢిల్లీకి వెళ్లాల్సిన ఫ్లైట్లు, రైళ్లను దాదాపుగా రద్దు చేశారు. ఒకవైపు దేశం నుంచే అంతర్జాతీయ స్థాయిలో విమానాలను రద్దు చేశారు. రాష్ట్రం నుంచి ఇప్పుడు ఢిల్లీకి వెళ్లే పరిస్థితులే కనిపించడం లేదు. దీంతో అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్, అదేస్థాయిలో కఠిన ఆంక్షల్లో ఉంటున్నా… తెలంగాణ మాత్రం నామమాత్రపై నైట్ కర్ఫ్యూతో ఏకాకిగానే మిగిలింది.