26 ట్రాక్టర్ల ఇసుక సీజ్.. తహసీల్దార్ హెచ్చరిక
దిశ, నెల్లికుదురు: అక్రమంగా ఇసుక డంపులు నిల్వచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సయ్యద్ రఫీయోద్దీన్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని దుర్గభవానితండా పరిధిలోని పీన్యభగ్న రాములు తండాల్లో అక్రమంగా ఇసుకను డంపులు నిల్వ చేశారనే పక్క సమచారంతో తహసీల్దార్ పోలీసులతో తనిఖీలు నిర్వహించి, ఇసుక డంపులను గుర్తించారు. అనంతరం ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. సుమారు 42 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక గుర్తించామని, 26 ట్రిప్పుల ఇసుకను సీజ్ చేసి, నెల్లికుదురు కస్తూర్భా పాఠశాల ఆవరణలో భద్రపరిచినట్లు […]
దిశ, నెల్లికుదురు: అక్రమంగా ఇసుక డంపులు నిల్వచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సయ్యద్ రఫీయోద్దీన్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని దుర్గభవానితండా పరిధిలోని పీన్యభగ్న రాములు తండాల్లో అక్రమంగా ఇసుకను డంపులు నిల్వ చేశారనే పక్క సమచారంతో తహసీల్దార్ పోలీసులతో తనిఖీలు నిర్వహించి, ఇసుక డంపులను గుర్తించారు. అనంతరం ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. సుమారు 42 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక గుర్తించామని, 26 ట్రిప్పుల ఇసుకను సీజ్ చేసి, నెల్లికుదురు కస్తూర్భా పాఠశాల ఆవరణలో భద్రపరిచినట్లు తెలిపారు. 16 ట్రిప్పుల ఇసుక సంబంధిత తండావాసులు ఇళ్ల నిర్మాణం కోసం తెచ్చుకున్నట్లు తెలిపారు. సమాచారం ఇవ్వకుండా ఇసుక నిల్వ చేసినందుకు తహసీల్దార్ ఆఫీసులో జరిమానా చెల్లించాలని గిరిజనులకు సూచించారు. అనంతరం స్వాధీన పరుచుకున్న ఇసుకను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ కట్టడాలకు వాడుతామన్నారు. ఈ తనిఖీల్లో ఏఎస్ఐ కందునూరి వెంకటేశ్వర్లు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.