ఈటలకు ఊరట.. ప్రచార బరిలోకి తీన్మార్ మల్లన్న టీం

దిశ, హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలలో భాగంగా తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్ రజిని కుమార్ ఆధ్వర్యంలో ప్రచారాన్ని ప్రారంభించారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కోసం పట్టణంలో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఆదివారం హుజూరాబాద్‌కు వచ్చిన తీన్మార్ మల్లన్న టీం సభ్యులు కేసి క్యాప్ నుంచి అంబేద్కర్ విగ్రహాం వరకు పాదయాత్ర చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రజినికుమార్ […]

Update: 2021-10-10 10:17 GMT

దిశ, హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలలో భాగంగా తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్ రజిని కుమార్ ఆధ్వర్యంలో ప్రచారాన్ని ప్రారంభించారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కోసం పట్టణంలో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఆదివారం హుజూరాబాద్‌కు వచ్చిన తీన్మార్ మల్లన్న టీం సభ్యులు కేసి క్యాప్ నుంచి అంబేద్కర్ విగ్రహాం వరకు పాదయాత్ర చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రజినికుమార్ మాట్లాడుతూ… తీన్మార్ మల్లన్నను ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించి ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి రాకుండా అడ్డుకునేందుకు మల్లన్నను రాత్రికి రాత్రే అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసి జైలుకు పంపారని మండిపడ్డారు. కొంత మంది మల్లన్న టీం సభ్యులను కూడా ప్రలోభాలకు గురి చేసి టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని విమర్శించారు. తీన్మార్ మల్లన్న టీం హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్తుందని, టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తుందన్నారు. మల్లన్న జైలు నుంచి విడుదలైన వెంటనే హుజూరాబాద్‌కు వస్తారని, స్థానిక టీం సభ్యులతో కలిసి ప్రచారం నిర్వహిస్తారని చెప్పారు. ఈ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మల్లన్న టీం సభ్యులు బండ రమేష్, దాసరి వెంకటేష్, దాట్ల శ్రీనివాస్, కోవరాజు సాగర్, సంతోష్, మండల కో కన్వీనర్లు శివారెడ్డి, నేదురు కుమారస్వామి, దేవరాజు, రాజ్‌కుమార్, సందీప్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News