ఫోన్ చార్జర్‌తో జాగ్రత్త.. చార్జింగ్ పెట్టాక ఏం జరిగిందంటే..?

దిశ, వెబ్ డెస్క్ : మీలో ఎవరైనా రాత్రి సమయంలో సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి పడుకుంటున్నారా.. అయితే ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. యూకేకు చెందిన ఓ 17 ఏళ్ల బాలిక రాత్రి 2 గంటల సమయంలో తన ఐ ఫోన్ చార్జింగ్ పెట్టి పడుకుంది. చార్జింగ్ కోసం ఫోన్‌ ప్లగ్ చేసినప్పుడు “సెట్ అలైట్” ఫలితంగా ఆమె బెడ్ కవర్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో ఆమె ముఖానికి కూడా గాయాలు అయ్యాయి. చార్జర్ […]

Update: 2021-03-25 05:19 GMT

దిశ, వెబ్ డెస్క్ : మీలో ఎవరైనా రాత్రి సమయంలో సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి పడుకుంటున్నారా.. అయితే ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. యూకేకు చెందిన ఓ 17 ఏళ్ల బాలిక రాత్రి 2 గంటల సమయంలో తన ఐ ఫోన్ చార్జింగ్ పెట్టి పడుకుంది. చార్జింగ్ కోసం ఫోన్‌ ప్లగ్ చేసినప్పుడు “సెట్ అలైట్” ఫలితంగా ఆమె బెడ్ కవర్‌కు మంటలు అంటుకున్నాయి.

దీంతో ఆమె ముఖానికి కూడా గాయాలు అయ్యాయి. చార్జర్ కారణంగా తనకు అయిన గాయాలను ఆమె ఫేస్ బుక్‌లో షేర్ చేసింది. ఈ సందర్భంగా తాను వాడింది నాసికరం చార్జర్ కాదు, ఒరిజినల్ ఐఫోన్ చార్జర్ అని తెలిపింది. అయితే దయచేసి ఎవరూ.. మంచానికి దగ్గరగా రాత్రిపూట మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకోవద్దు అని కోరింది.

 

Tags:    

Similar News