కిరాయికి గర్ల్‌ఫ్రెండ్

దిశ, వెబ్‌డెస్క్ : బైకులు, కార్లు, ఫర్నిచర్, ఇల్లు వంటివి అద్దెకు ఇస్తారని తెలుసు. మరి ‘గర్ల్‌ఫ్రెండ్’ను కూడా అద్దెకు ఇస్తారా? అంటే.. అవును ఇక్కడొక చోట ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అయితే అందుకు కొన్ని షరతులు ఉండటం గమనార్హం. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించినా, సంబంధిత చట్టాలను అతిక్రమించినా.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇంతకీ ఈ రెంట్ సిస్టమ్ ఎక్కడ ఉందంటే.. ‘పీపుల్ రెంటింగ్ సర్వీస్’ అనేది కొత్తగా పుట్టుకొచ్చిన విధానమేమీ కాదు. జపాన్, చైనాలో […]

Update: 2021-01-16 04:07 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బైకులు, కార్లు, ఫర్నిచర్, ఇల్లు వంటివి అద్దెకు ఇస్తారని తెలుసు. మరి ‘గర్ల్‌ఫ్రెండ్’ను కూడా అద్దెకు ఇస్తారా? అంటే.. అవును ఇక్కడొక చోట ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అయితే అందుకు కొన్ని షరతులు ఉండటం గమనార్హం. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించినా, సంబంధిత చట్టాలను అతిక్రమించినా.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇంతకీ ఈ రెంట్ సిస్టమ్ ఎక్కడ ఉందంటే..

‘పీపుల్ రెంటింగ్ సర్వీస్’ అనేది కొత్తగా పుట్టుకొచ్చిన విధానమేమీ కాదు. జపాన్, చైనాలో ఈ తరహా సర్వీసులు ఎప్పటి నుంచో చలామణిలో ఉన్నాయి. ఓ సింగిల్ మదర్ తన కొడుకు కోసం కొన్ని సంవత్సరాల పాటు ఓ తండ్రిని రెంట్‌కు తీసుకున్న సంఘటన గురించి గతంలో వినే ఉంటారు. తైవాన్‌కు చెందిన ‘లవ్ యాక్టింగ్ ఎక్స్‌ట్రా’ కూడా ఇదే తరహాలో ‘రెంటల్ సర్వీస్’ అందిస్తోంది. అక్కడ లవర్స్, పేరెంట్స్, గర్ల్‌ఫ్రెండ్, అంతెందుకు స్నేహితులను కూడా అద్దెకిస్తారు. కానీ ప్రతి బంధానికి, రెంట్‌కు కొన్ని పరిమితులు, బౌండరీలతో పాటు నియమ నిబంధనలు కూడా కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తైవాన్ యూనివర్శిటీలో చదువుతున్న చెన్ అనే యువకుడు ‘లవ్ యాక్టింగ్-ఎక్స్‌ట్రా’సంస్థ ద్వారా 7,200 తైవాన్ డాలర్లు (రూ.19 వేలు) చెల్లించి మూడు గంటల పాటు యాక్ట్ చేసేందుకు ఓ గర్ల్ ఫ్రెండ్‌ను తెచ్చుకున్నాడు.

కాగా, సంస్థ నిబంధనల ప్రకారం అతడు ఆ అమ్మాయి చేయి పట్టుకోవచ్చు, తలను నిమరవచ్చు, కౌగిలించకోవచ్చు కానీ అంతకుమించి లిమిట్స్ క్రాస్ చేయదానికి వీల్లేదు. అయితే చెన్ మాత్రం తన రెంటెడ్ గర్ల్‌ఫ్రెండ్‌తో అసభ్యకరంగా మాట్లాడటమే కాకుండా, కిడ్నాప్ చేస్తానంటూ బెదిరించాడు. అక్కడితో ఆగకుండా ఆమె శరీర భాగాలను తాకడం మొదలుపెట్టాడు. అతడు నిబంధనలు అతిక్రమించడంతో ఆమె పోలీస్‌స్టేషన్‌లో చెన్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేయగా, కోర్టు అతడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 1,80,00 తైవాన్ డాలర్లు (రూ.4,69,696) జరిమానా కూడా విధించింది.

Tags:    

Similar News