యూట్యూబ్‌లో డీప్ ఫేక్ వీడియోలకు ఇక చెక్

దిశ, టెక్ బ్యూరో : ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో డీప్ ఫేక్ కంటెంట్ బాగా పెరిగిపోయింది.

Update: 2024-06-22 18:33 GMT

దిశ, టెక్ బ్యూరో : ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో డీప్ ఫేక్ కంటెంట్ బాగా పెరిగిపోయింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీని వాడుకొని తయారు చేసిన డీప్ ఫేక్ వీడియోలు యూట్యూబ్‌లోనూ హల్‌చల్ చేస్తున్నాయి. అటువంటి వీడియో కంటెంట్‌కు చెక్ పెట్టే దిశగా యూట్యూబ్ కీలక ముందడుగు వేసింది. అనుమతి లేకుండానే ఇతరుల వాయిస్‌ను ఏఐ టెక్నాలజీతో అక్రమంగా వాడుకొని కంటెంట్‌ను క్రియేట్ చేస్తున్న వారికి చెక్ పెట్టే దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఎవరైనా యూట్యూబ్‌లో మీ ఫొటో లేదా వాయిస్‌ని ఉపయోగించి రూపొందించిన కంటెంట్‌ కనిపిస్తే వెంటనే రిపోర్ట్‌ చేయొచ్చు. యూజర్ల అభ్యర్థన మేరకు ఆ వీడియోలను పరిశీలించి, కంటెంట్‌ వాస్తవానికి విరుద్దంగా ఉందా? లేదా ? అనేది యూట్యూబ్ నిర్ధారిస్తుంది. ఒకవేళ అవి డీప్ ఫేక్ వీడియోలే అని తేలితే నేరుగా తొలగిస్తుంది. కంటెంట్‌ క్రియేటర్లు ఏఐ టెక్నాలజీని వినియోగిస్తే తప్పకుండా ఆ విషయాన్ని యూజర్లకు తెలియజేయాలని యూట్యూబ్ అంటోంది.


Similar News