WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే..?

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తన యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-27 02:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తన యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇన్‌స్టాగ్రామ్(Instagram) తరహాలోనే చాలా రకాల ఫీచర్స్ ను ప్రవేశపెడుతోంది. ఇదిలా ఉంటే వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మనకు నచ్చిన గ్రూప్స్ చాట్స్(Group Chats) లేదా పర్సన్ చాట్స్(Person Chats)ని పిన్ చేసుకొని నేరుగా ఫేవరెట్ ఆప్షన్(Favorite Option)లో పెట్టుకోవచ్చు. దీని ద్వారా చాట్స్ ను గుర్తించడం ఈజీగా అవుతుంది. అయితే ఈ ఫీచర్ ను యాక్సెస్ చేయాలంటే ముందుగా వాట్సాప్ లో చాట్స్ ట్యాబ్(Chats Tab) పైన ఉన్న ఫేవరెట్ ఆప్షన్ లోకి వెళ్లి ఆడ్ టు ఫేవరెట్స్(Add to Favorites) పైన క్లిక్ చేయాలి. అందులో మీకు నచ్చిన త్రీ  గ్రూప్ చాట్స్ లేదా పర్సన్ చాట్స్ ని హోల్డ్ చేసి సెలెక్ట్ చేయాలి సేవ్ చేసుకోవాలి. దీంతో ఎప్పుడైనా మనకు అవసరమున్నప్పుడు ఫేవరెట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనం సేవ్ చేసిన చాట్స్ కనిపిస్తాయి. కాగా వాట్సాప్ ఇప్పటికే ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవి కాకుండా వాట్సాప్ లోనే స్పెషల్ గా కాంటాక్ట్ సేవ్ చేసుకునే ఫీచర్ అందిస్తోంది. ఇవేగాక ఇంకా చాలా ఫీచర్లు వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది.   

Tags:    

Similar News