Airtel, Jio, Vi.. ఏ కంపెనీ చౌకైన నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌ని అందిస్తుంది..
భారతదేశంలోని అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లతో పోలిస్తే నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌లు కొంచెం ఖరీదైనవి.
దిశ, వెబ్‌డెస్క్ : భారతదేశంలోని అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లతో పోలిస్తే నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌లు కొంచెం ఖరీదైనవి. అందుకే చాలా మంది ప్రజలు ఉచిత నెట్‌ఫ్లిక్స్‌కి యాక్సెస్ పొందగలిగే రీఛార్జ్ ప్లాన్‌ల కోసం చూస్తుంటారు. ఈ క్రమంలోనే Jio, Airtel, Vi ఈ మూడు టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌లను అందుబాటులో ఉంచాయి. ఈ మూడు సంస్థల్లో ఏ టెలికాం కంపెనీ వినియోగదారుల కోసం చౌకైన నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌ను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జియో నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌లు..
రిలయన్స్ జియో చౌకైన నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ రూ. 1299. Jio 1299 ప్లాన్‌లో మీరు రోజుకు 2 GB డేటా, రోజుకు 100 SMS, ఉచిత కాలింగ్‌తో 84 రోజుల వాలిడిటీని అందించనున్నారు. ఈ ప్లాన్‌తో మీకు నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్‌కి ఉచిత యాక్సెస్ కూడా అందుబాటులో ఉంటుంది గుర్తుంచుకోండి.
Vi ఉచిత నెట్‌ఫ్లిక్స్ ప్లాన్..
Vi నుంచి చౌకైన నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ ధర రూ. 1198. Vi 1198 ప్లాన్‌తో కంపెనీ ప్రతిరోజూ 2 GB డేటా, ఉచిత అపరిమిత కాలింగ్, రోజువారీ 100 SMS, 70 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది.
అదనపు ప్రయోజనాల గురించి చెప్పాలంటే.. ఈ ప్లాన్ బింగే ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్‌ఓవర్ (మీరు వారాంతంలో సోమవారం నుండి శుక్రవారం వరకు మిగిలి ఉన్న మీ రోజువారీ డేటాను ఉపయోగించవచ్చు), డేటా డిలైట్, నెట్‌ఫ్లిక్స్ (టీవీ, మొబైల్ ఉచిత యాక్సెస్ ఇస్తారు). ఈ ప్లాన్‌లో ఉచిత నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ 70 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.
ఎయిర్‌టెల్ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌లు..
ఎయిర్‌టెల్ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌ని కలిగి ఉంది. అయితే ఎయిర్‌టెల్ ప్లాన్ Jio, Vi కంటే చాలా ఖరీదైనది. ఎయిర్‌టెల్ 1798 ప్లాన్‌తో ఉచిత నెట్‌ఫ్లిక్స్ బేసిక్, ప్రతిరోజూ 3GB డేటా, ఉచిత కాలింగ్, రోజువారీ 100 SMS లు అందించనున్నారు. అంతే కాదు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్, అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్, ఉచిత హలో ట్యూన్ యాక్సెస్ అందుబాటులో ఉంది.