ఎలక్ట్రిక్ గీజర్ కూడా ఏసీ కంప్రెసర్ లాగా పేలుతుందా.. కారణం తెలుసుకోండి మరి..

చలికాలం వచ్చేస్తుంది. చల్లటి నీళ్లను తలచుకుంటేనే వణుకు పుట్టేస్తుంది.

Update: 2024-10-11 09:41 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : చలికాలం వచ్చేస్తుంది. చల్లటి నీళ్లను తలచుకుంటేనే వణుకు పుట్టేస్తుంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు గీజర్లు, వాటర్ హీటర్లను వినియోగించడం ప్రారంభిస్తారు. అయితే గత ఏడాది కాలంగా అక్కడక్కడ వేసవి కాలంలో ఏసీలు పేలిపోయిన దాఖలాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ చలికాలంలో గీజర్ కూడా అలా పేళి పోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడినప్పుడు లేదా అకస్మాత్తుగా వోల్టేజ్ పెరిగినప్పుడు గీజర్ పగిలిపోయే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ గీజర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు మీరు ఇక్కడ పేర్కొన్న విషయాలను దృష్టిలో ఉంచుకుంటే, మీ గీజర్ ఎయిర్ కండీషనర్ కంప్రెసర్ లాగా పేలదు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉష్ణోగ్రత ఒత్తిడి వాల్వ్ (TPV) వైఫల్యం..

గీజర్‌లో సేఫ్టీ వాల్వ్ ఉంటుంది. ఇది ఉష్ణోగ్రత, పీడనాన్ని నియంత్రిస్తుంది. ఈ వాల్వ్ సరిగ్గా పని చేయకపోయినా, నీటి ఉష్ణోగ్రత అతిగా పెరిగినా, ఒత్తిడి పెరగడం వల్ల గీజర్ పగిలిపోవచ్చు. అందుకే శీతాకాలంలో గీజర్‌ను ఉపయోగించే ముందు, దానిని మంచి మెకానిక్‌తో సర్వీసింగ్ చేయాలి.

అధిక ఉష్ణోగ్రత..

గీజర్ ఉష్ణోగ్రత హై లెవల్ లో సెట్ చేసి, భద్రతా వ్యవస్థ సరిగ్గా పని చేయకపోతే, నీటిలో ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది. దీని వలన గీజర్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మీరు మాన్యువల్ ప్రకారం ఎలక్ట్రిక్ గీజర్, ఉష్ణోగ్రతను నిర్వహించాలి.

నీటిలో మురికి..

నీటిలో ఉండే మినరల్స్ (కాల్షియం, మెగ్నీషియం వంటివి) కారణంగా గీజర్ లోపల మురికి పేరుకుపోతుంది. ఈ ధూళి హీటింగ్ ఎలిమెంట్‌ పై ఒత్తిడి తెస్తుంది. ఇది గీజర్ ఉష్ణోగ్రత, పీడనానికి ఆటంకం కలిగిస్తుంది. అది ప్రమాదానికి దారితీస్తుంది.


Similar News