National Space Day 2024:నేడు నేషనల్ స్పేస్ డే..ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అడుగుపెట్టి నేటికి (ఆగస్టు 23) ఏడాది పూర్తి అయింది.

Update: 2024-08-23 06:15 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అడుగుపెట్టి నేటికి (ఆగస్టు 23) ఏడాది పూర్తి అయింది. ఈ క్రమంలో చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిన ఆగస్టు 23ను ఇకపై జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నేడు (శుక్రవారం) తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ దేశ ప్రజలకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష రంగానికి సంబంధించిన ఎన్నో భవిష్యత్తు నిర్ణయాలను తమ ప్రభుత్వం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరెన్నో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. అంతరిక్ష రంగంలో మన దేశం సాధించిన విజయాలను ఎంతో గర్వంగా గుర్తు చేసుకుంటున్నాం. మన అంతరిక్ష శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించే రోజు కూడా అంటూ అంతరిక్ష శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని కొనియాడారు. రాబోయే రోజుల్లో మేము ఈ రంగం అభివృద్ధికి మ‌రింత కృషి చేస్తాం అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Tags:    

Similar News