ఈ యాప్ లు ఉంటే చాలు.. ప్రభుత్వ సేవలన్నీ అరచేతిలోనే..
ఏదైనా ప్రభుత్వ పనిని మనం పూర్తి చేసుకోవాలంటే ఒక కార్యాలయం నుండి మరొక కార్యాలయానికి తిరగాలి.
దిశ, ఫీచర్స్ : ఏదైనా ప్రభుత్వ పనిని మనం పూర్తి చేసుకోవాలంటే ఒక కార్యాలయం నుండి మరొక కార్యాలయానికి తిరగాలి. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది. టెక్నాలజీ పెరిగిపోయింది. ఆన్‌లైన్‌లో ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. దీంతో బయటికి వెళ్లకుండానే తమ తమ పనులకు ఇంటి నుంచే చక్కబెట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఆన్లైన్ సేవలకు అనుగుణంగా కొన్ని యాప్ లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత ప్రభుత్వ సేవల ప్రయోజనాలను పొందడం చాలా సులభం అవుతుంది. మీ పనిని సులభతరం చేసే 5 ప్రభుత్వ యాప్‌ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. నెక్స్ట్ జెన్ ఎంపరివాహన్
NextGen mParivahan అనేది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసిన యాప్. ఈ యాప్ వాహన రిజిస్ట్రేషన్‌తో పాటు వివిధ రవాణా సంబంధిత సేవల సమాచారాన్ని అందిస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ఇతర సమాచారం, ఇతర సేవల డిజిటల్ కాపీలను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఈ యాప్ భారతదేశంలో రిజిస్టర్ చేసిన అన్ని వాహనాల సమగ్ర వివరాలను అందిస్తుంది. ఈ యాప్‌లో డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా సేవ్ చేయవచ్చు, మీరు దీన్ని ట్రాఫిక్ పోలీసులకు చూపిస్తే ఇది చలాన్‌ను నివారించడంలో సహాయపడుతుంది.
2. ఉమంగ్
UMANG యాప్ అన్ని ప్రభుత్వ సేవలను ఒకేచోట అందిస్తుంది. ఉమంగ్ యాప్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనేక సేవలు అందుబాటులో ఉంటాయి. ఆధార్, డిజిలాకర్, ఇఎస్‌ఐ, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ మొదలైన వాటి కోసం మీరు ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
3. mPassport సేవ
mPassport సేవా యాప్ పాస్‌పోర్ట్ పొందడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంలో సహాయపడుతుంది. ఈ యాప్‌తో మీరు పాస్‌పోర్ట్ కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు, ఫీజులు చెల్లించవచ్చు, పత్రాలను అప్‌లోడ్ చేయవచ్చు, పాస్‌పోర్ట్ స్టాటస్ ని ట్రాక్ చేయవచ్చు.
4. డిజిలాకర్
DigiLocker యాప్ సహాయంతో ముఖ్యమైన పత్రాలను డిజిటల్ వెర్షన్‌లో సేవ్ చేయవచ్చు. మీరు ఈ యాప్‌లో వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ మొదలైన అనేక పత్రాలను అప్‌లోడ్ చేయవచ్చు. తద్వారా మీకు ఏదైనా పత్రం అవసరమైనప్పుడు వెంటనే ఆ యాప్ ద్వారా డాక్యుమెంట్ ని తీసుకోవచ్చు.
5. mAadhaar
ఆధార్ కార్డుకు సంబంధించిన అన్ని పనులను నిర్వహించడానికి mAadhaar యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్‌తో మీరు మొబైల్ ఫోన్‌లో ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఆధార్ వెరిఫికేషన్ కూడా ఇక్కడి నుంచే జరుగుతుంది. కావాలంటే ఈ యాప్ ద్వారా ఆధార్ వివరాలను కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీరు Google Play Store లేదా Apple App Storeకి వెళ్లాలి. ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ప్రభుత్వ సేవలను పొందడం సులభం అవుతుంది.