అమెజాన్ సమ్మర్ స్పెషల్: ఈ టోపీలతో మండే ఎండలో కూడా చల్లగా ఉండొచ్చు!

సమ్మర్ స్టార్ట్ అయ్యింది. మార్చి నెల ప్రారంభం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు. కానీ ముఖ్యమైన పనుల కోసం తప్పనిసరిగా బయటకు రావాల్సి వస్తుంది.

Update: 2024-03-16 09:14 GMT

దిశ, ఫీచర్స్ : సమ్మర్ స్టార్ట్ అయ్యింది. మార్చి నెల ప్రారంభం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు. కానీ ముఖ్యమైన పనుల కోసం తప్పనిసరిగా బయటకు రావాల్సి వస్తుంది. అంతే కాకుండా కొంత మంది,ర్యాపిడో, ఓలా , స్విగ్గీ, డెలివరీ బాయ్స్ బైక్ పై ఎక్కువగా కనిపిస్తుంటారు. ఎంత ఎండ ఉన్నా వారు వారి పనిచేసుకుంటూ కనిపిస్తారు. అయితే అలాంటి వారు ఎండ నుంచి తమను కాపాడుకోవడానికి క్యాప్స్ వాడుతుంటారు. కాగా, అలాంటి వారి కోసం ఫ్యాన్ క్యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక వీటిని అమెజాన్ సంస్థ చాలా తక్కువ ధరలో తన వినియోగదారులకు అందిస్తుంది. ఇక వాటికి ఎంత ధర ఉందో ఒక లుక్ వేద్దాం.

ఫేస్ కూలింగ్ క్యాప్ : ఎండ నుంచి కాపాడుకోవడానికి,ఫేస్ కూలింగ్ క్యాప్ అనేది చాలా బాగుంటుది. యూఎస్‌బీ రీఛార్జబుల్‌తో వచ్చే ఈ క్యాప్‌ను ఒక్కసారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే 3 గంటలు పనిచేస్తుంది. ఇది మండుటెండల్లో కూడా చల్లటి గాలిని అందిస్తాయి. ఇక ఈ ఫ్యాన్ ధర అమెజాన్‌లో 692కి అందుబాటులో ఉంది.

TLISMI పోర్టబుల్ ఫ్యాన్ : కాటన్‌తో తయారు చేసిన ఈ ఫ్యాన్ చూడటానికి స్టైలిష్ లుక్‌లో చాలా బాగుంటుంది. ఎండలో ఎక్కువ సేపు పని చేసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇక ఈ ఫ్యాన్ ధర అమెజాన్‌లో రూ.899కి లభిస్తుంది.

Lukzerఎలక్ట్రిక్ ఫ్యాన్ క్యాప్ : ఈ ఫ్యాన్‌పై అమెజాన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీని అసలు ధర 1099కాగా, ఆఫర్‌లో భాగంగా ఇది 599కే అందుబాటులో ఉంది. మూడు లెవల్స్‌లో ఫ్యాన్‌ స్పీడ్‌ను అడ్జెస్ట్ చేసుకోవచ్చు. యూఎస్‌బీ కేబుల్‌తో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక ఇదే కాకుండా ఇంకా రకరకాల డిజైన్‌తో ఫ్యాన్ క్యాప్స్ అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లలను ఎండ వేడి నుంచి కాపాడటానికి కూడా చిల్డ్రన్ ఫ్యాన్ క్యాప్స్ అందుబాటులో ఉన్నాయి. కాగా, సమ్మర్ వేడి నుంచి బయటపడటానికి మీకు నచ్చిన ఫ్యాన్ క్యాప్‌ను కొనుగోలు చేయండి. చల్లగా ఉండండి.


Similar News