మార్కెట్లోకి విడుదలైన iQoo కొత్త స్మార్ట్‌ఫోన్

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ iQoo ఇండియాలో గురువారం కొత్త మోడల్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘iQoo Z9x 5G’

Update: 2024-05-16 08:17 GMT

దిశ, టెక్నాలజీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ iQoo ఇండియాలో గురువారం కొత్త మోడల్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘iQoo Z9x 5G’. ఇది మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 4GB RAM+128GB ధర రూ.12,999. 6GB RAM+128GB వేరియంట్ ధర రూ. 14,499. 8GB RAM+ 128GB స్టోరేజ్‌ ధర రూ.15,999. ఫోన్ టోర్నాడో గ్రీన్, స్టార్మ్ గ్రే రంగులలో అందుబాటులో ఉంది. మే 21 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, కంపెనీ వెబ్‌సైట్ ద్వారా అమ్మకానికి ఉంటుంది. కొనుగోలు సమయంలో SBI, ICICI బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై రూ.1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది.


iQoo Z9x 5G స్పెసిఫికేషన్లు

* 6.72-అంగుళాల పూర్తి--HD+ (1,080x2,408 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌.

* Android 14 Funtouch OS 14 పై రన్ అవుతుంది.

* ఆక్టా-కోర్ 4nm స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 చిప్ ద్వారా పని చేస్తుంది.

* ఫోన్ బ్యాక్ సైడ్ 50MP+2MP కెమెరా ఉంది.

* ముందు సెల్ఫీల కోసం 8MP కెమెరాను అందించారు.

* మెమరీని మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు.

* 44W ఫ్లాష్ చార్జ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ ఉంది.

* దుమ్ము, స్ప్లాష్ రక్షణ కోసం IP64 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.


Similar News