WhatsApp :సైబర్ కేటుగాళ్లు వాట్సాప్‌ను తెగ వాడేస్తున్నారు.. సంచలన నివేదిక
దిశ, నేషనల్ బ్యూరో : మన దేశంలో సైబర్ క్రైమ్స్ కోసం నేరగాళ్లు అత్యధికంగా వాట్సాప్(WhatsApp)ను వాడుకుంటున్నారని కేంద్ర హోంశాఖ(MHA) వెల్లడించింది.
దిశ, నేషనల్ బ్యూరో : మన దేశంలో సైబర్ క్రైమ్స్ కోసం నేరగాళ్లు అత్యధికంగా వాట్సాప్(WhatsApp)ను వాడుకుంటున్నారని కేంద్ర హోంశాఖ(MHA) వెల్లడించింది. 2023-2024 సంవత్సరంలో సైబర్ కేటుగాళ్లు(online scammers) సోషల్ మీడియా(social media)ను దుర్వినియోగం చేసిన తీరుతెన్నుల వివరాలతో హోంశాఖ వార్షిక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. 2024 సంవత్సరంలో జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో 43,797 సైబర్ మోసాలు వాట్సాప్ వేదికగానే జరిగాయి. 22,680 సైబర్ మోసాలు టెలిగ్రామ్ యాప్ ద్వారా, 19,800 సైబర్ మోసాలు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జరిగాయి.
అమాయక ప్రజలకు వల వేసేందుకు సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఫేస్‌బుక్ యాడ్స్‌ను వాడుకున్నారని వెల్లడైంది. అక్రమ డిజిటల్ లోన్ యాప్‌లకు సంబంధించిన యాడ్స్‌ను ఫేస్‌బుక్‌పై అత్యధికంగా నడుపుతున్నారని గుర్తించారు. ఈ తరహా మోసపూరిత ప్రకటనలను ఎప్పటికప్పుడు గుర్తించి అడ్డుకునేందుకు కేంద్ర హోంశాఖకు చెందిన ఐ4సీ విభాగం గూగుల్, ఫేస్‌బుక్‌లతో సమన్వయం చేసుకుంటోందన్నారు. గూగుల్ యాడ్స్‌ను కూడా సైబర్ మోసగాళ్లు వాడుకుంటున్నట్లు తెలిపారు.