రూ. 7 వేల ధరలో Poco C51 స్మార్ట్ ఫోన్
Poco కంపెనీ నుంచి కొత్తగా భారత మార్కెట్లోకి ‘Poco C51’ మోడల్ లాంచ్ అయింది.
దిశ, వెబ్‌డెస్క్:Poco కంపెనీ నుంచి కొత్తగా భారత మార్కెట్లోకి ‘Poco C51’ మోడల్ లాంచ్ అయింది.ఇది 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 8,499. పవర్ బ్లాక్, రాయల్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభిస్తున్న ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు వస్తుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ. 1000 తగ్గింపుతో లభిస్తుంది. అలాగే Flipkart Axis బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్ బ్యాక్ కూడా ఉంది.
Poco C51 స్పెసిఫికేషన్లు
* 6.52-అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్‌లు) డిస్‌ప్లే.
* 120Hz టచ్ శాంప్లింగ్ రేట్, 400 నిట్స్ బ్రైట్‌నెస్.
* ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్)లో రన్ అవుతుంది.
* ఆక్టా-కోర్ MediaTek Helio G36 SoC ద్వారా పనిచేస్తుంది.
* బ్యాక్ సైడ్ 8MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.
* ముందు సెల్ఫీల కోసం 5MP కెమెరాను అమర్చారు.
* 5,000mAh భారీ బ్యాటరీని అందించారు.