ఓలా, ఊబర్ అదనంగా ఛార్జీలు వసూలు చేశాయా.. ఈ విధంగా డబ్బు తిరిగి పొందండి

భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా ఓలా, ఊబర్ క్యాబ్ సేవలు విస్తరించి ఉన్నాయి.

Update: 2024-01-11 07:54 GMT

దిశ, ఫీచర్స్ : భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా ఓలా, ఊబర్ క్యాబ్ సేవలు విస్తరించి ఉన్నాయి. కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు మనకు కావాల్సిన అడ్రస్ కు చేరుకోవాలంటే ఎక్కువగా ఓలా, ఊబర్ ను ఆశ్రయిస్తాం. అయితే కొన్నిసార్లు యాప్ లో కనిపించిన దానికంటే ఎక్కువ చార్జీలను తీసుకుంటారు క్యాబ్ డ్రైవర్ లు. ఇలాంటి ఫిర్యాదులు ఇప్పటివరకు చాలానే చేస్తున్నారు. మీకు కూడా ఇలా జరిగితే, కంపెనీ నుండి వాపసు ఎలా పొందాలో చూడండి.

ఓలా, ఊబర్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్యాబ్ సేవలు. దేశంలోని అనేక నగరాల్లో ప్రజలు వాటిని పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. ఓలా లేదా ఊబర్ ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు, కొన్నిసార్లు మీకు నిర్ణీత ఛార్జీల కంటే ఎక్కువ ఛార్జీలు తీసుకుంటారు. క్యాబ్‌ను బుక్ చేసుకునే సమయంలో ఛార్జీ తక్కువగా ఉన్నప్పటికీ ప్రయాణం పూర్తయిన తరువాత అధిక మొత్తంలో ఛార్జీలు చెల్లించమని అడుగుతుంటారు. ఇలాంటి సంఘటనకు చాలానే జరుగుతుంటాయి. అయితే నిర్ణీత చార్జీల కంటే అధిక మొత్తంలో చార్జీలు చెల్లిస్తే ఆ డబ్బును తిరిగి పొందవచ్చు.

క్యాబ్ డ్రైవర్ల ఛార్జీల పెంపు : కొంతమంది క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికుల నుండి ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడానికి మోసం చేస్తారు. వారు తమ రైడ్‌లను పొడిగించుకోవడానికి దూర మార్గాలను లేదా ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్న రహదారులను ఎంచుకుంటారు. దీంతో క్యాబ్ చార్జీలు అత్యధికంగా పెరుగుతాయి.

క్యాబ్ సర్వీస్‌లో సాంకేతిక లోపాలు : కొన్నిసార్లు, క్యాబ్ సర్వీస్‌లో సాంకేతిక లోపాల కారణంగా, ప్రయాణీకుల నుండి అధిక ఛార్జీలు వసూలు చేస్తుంటారు. క్యాబ్ సర్వీస్ మీరు ప్రయాణం చేసిన దూరాన్ని, సమయాన్ని సరిగ్గా ట్రాక్ చేయలేనప్పుడు ఇలా జరుగుతుంది.

అదనపు చార్జీలు రీ ఫండ్..

నిర్ణీత చార్జీల కంటే మీకు ఎక్కువ ఛార్జీలు విధించినట్లు మీరు భావిస్తే, మీ డబ్బులను వాపసు తీసుకునేందుకు అభ్యర్థించవచ్చు. రిక్వెస్ట్ ని ఆక్సెప్ట్ చేసిన ఓలా, ఊబర్ సంస్థలు తమ కస్టమర్‌లకు రీఫండ్‌లను అందిస్తాయి.

ఓలా - ఊబర్ నుండి రీఫండ్ ఎలా పొందాలి..

ఓలా, ఊబర్ నుండి రీఫండ్ పొందాలంటే ఆయా యాప్ లను ఓపెన్ చేసి మెనూలోకి వెళ్లండి.

ముందుగా ఛార్జీ వసూలు చేసే రైడ్‌ను ఎంచుకోండి.

తర్వాత హెల్ప్ ఆప్షన్‌ ను క్లిక్ చేయండి.

అనంతరం మీరు చెల్లింపునకు సంబంధించిన ఆప్షన్ ను ఎంచుకోవాలి.

అధిక ఛార్జీలు వసూలు ఆప్షన్ ను ఎంపికను ఎంచుకోండి.

ఇప్పుడు మీరు ప్రయాణానికి సంబంధించిన వివరాలను సెండ్ చేయాలి. మీ నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసినట్లు ఎందుకు భావిస్తున్నారో వివరించండి. ఆపై మీ అభ్యర్థనను సమర్పించండి. ఓలా, ఊబర్ మీ అభ్యర్థనను తనిఖీ చేస్తాయి. మీ ఫిర్యాదు నిజమని తేలితే మీ డబ్బులు మీకు వాపసు ఇచ్చేస్తాయి.

Tags:    

Similar News