Infinix నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్.. లాంచ్ తేదీ ఇదే!

Infinix సంస్థ ఇండియాలో కొత్తగా ఒక స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. దీని పేరు 'Infinix Zero 5G 2023'.

Update: 2023-01-23 10:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: Infinix సంస్థ ఇండియాలో కొత్తగా ఒక స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. దీని పేరు 'Infinix Zero 5G 2023'. ఇది ఇంతకుముందు ఇతర దేశాల్లో లాంచ్ అయింది. ఇప్పుడు భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. వచ్చే నెల ఫిబ్రవరి 4న ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి ఉంటుందని కంపెనీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇది రూ. 19,500 ధరలో లభించే అవకాశం ఉంది. ధరకు సంబంధించిన పూర్తి వివరాలు లాంచ్ టైం లో తెలియజేస్తారు.


Infinix Zero 5G 2023 స్పెసిఫికేషన్స్

* 6.78-అంగుళాల పూర్తి-HD+ IPS LTPS డిస్‌ప్లే.

* MediaTek డైమెన్సిటీ 1080 5G SoC, ఆర్మ్ మాలి-G68 MC4 GPU ప్రాసెసర్.

* Android 12-ఆధారిత XOS 12తో రన్ అవుతుంది.

* 13GB RAM 256 GB మెమరీ.


* 50MP+2MP+2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్.

* సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ సెన్సార్‌.

* 33W ఫాస్ట్ చార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది.




Tags:    

Similar News