రూ.7 వేల ధరలో 6,000mAh బ్యాటరీతో Infinix Smart 7 స్మార్ట్ ఫోన్

Infinix కంపెనీ ఇండియాలో కొత్తగా స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ పేరు ‘Infinix Smart 7’.

Update: 2023-02-24 10:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: Infinix కంపెనీ ఇండియాలో కొత్తగా స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ పేరు ‘Infinix Smart 7’. 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,299. ఫిబ్రవరి 27 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ఎమరాల్డ్ గ్రీన్, నైట్ బ్లాక్, అజూర్ బ్లూ అనే కలర్స్‌లో లభిస్తుంది. బ్యాటరీ పరంగా స్టాండ్‌బైలో 33 రోజుల వరకు, టాక్ టైమ్‌లో దాదాపు 50 గంటల వరకు, దాదాపు 24 గంటల వీడియో ప్లేబ్యాక్‌‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.


Infinix Smart 7 స్పెసిఫికేషన్లు

* 6.6-అంగుళాల, HD+ (1612×720) రిజల్యూషన్‌తో IPS LCD డిస్‌ప్లే.

* 60Hz రిఫ్రెష్ రేట్, 500నిట్స్ గరిష్ట ప్రకాశం కలిగి ఉంది.

* Unisoc SC9863A1 SoC, PowerVR GPU ద్వారా పనిచేస్తుంది.

* XOS 12 స్కిన్‌తో సరికొత్త Android 12ని ద్వారా రన్ అవుతుంది.


* ఫోన్ బ్యాక్ సైడ్ 13MP+2MP కెమెరాలు ఉన్నాయి.

* ముందు సెల్ఫీల కోసం 5MP కెమెరా ఉంది.

* 10W ఛార్జింగ్‌‌తో 6,000mAh బ్యాటరీ ఉంది.

* బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ముందు ఫేస్ అన్‌లాక్‌తో ఫీచర్ ఉంది.

Tags:    

Similar News