ఫాస్ట్ చార్జింగ్, ఐస్ స్టార్మ్ కూలింగ్ టెక్నాలజీతో Infinix కొత్త ల్యాప్‌టాప్
Infinix కంపెనీ భారత్‌లో కొత్తగా ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ పేరు ‘Infinix Inbook Y1 ప్లస్’.
దిశ, వెబ్‌డెస్క్: Infinix కంపెనీ భారత్‌లో కొత్తగా ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ పేరు 'Infinix Inbook Y1 ప్లస్'. దీని ధర రూ. 27,990. దీనిలో రెండు వేరియంట్లు ఉన్నాయి. 8GB RAM +256 GB వేరియంట్ ధర రూ. 29,990. 8GB RAM + 512GB స్టోరేజ్ ధర రూ. 32,990. ల్యాప్‌టాప్ ఫిబ్రవరి 24న అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఇది బ్లూ, గ్రే, సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. లాంచ్ ఆఫర్ భాగంగా ఎంపిక చేసిన వివిధ బ్యాంకు కార్డుల ద్వారా రూ. 27,990 కే కొనుగోలు చేయవచ్చు.
Infinix Inbook Y1 ప్లస్ స్పెసిఫికేషన్‌లు
1920×1080 రిజల్యూషన్‌తో 15.6-అంగుళాల డిస్‌ప్లే, 250 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్. intel కోర్ i3 10th జనరేషన్ ప్రాసెసర్. UHD గ్రాఫిక్స్‌తో వస్తుంది. మెమరీని 2TB వరకు పెంచుకోవచ్చు. ల్యాప్‌టాప్ విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. 2MP ఫుల్ HD వెబ్ కెమెరా, డ్యూయల్-LED ఫ్లాష్‌ని కలిగి ఉంది. మెరుగైన వీడియో కాల్‌ల కోసం కెమెరా, నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అందుబాటులో ఉంది. ల్యాప్‌టాప్ 65W ఫాస్ట్ చార్జింగ్‌తో 50Wh బ్యాటరీని కలిగి ఉంది. కేవలం ఒక గంట టైం లో బ్యాటరీ 75 శాతం వరకు చార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ల్యాప్‌టాప్‌లో ఐస్ స్టార్మ్ కూలింగ్ సిస్టమ్‌తో పాటు 2W డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.