Vodafone idea: వోడాఫోన్ ఐడియా యూజర్లకు భారీ గుడ్ న్యూస్..

Update: 2024-08-15 12:21 GMT

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య ఎక్కడ కొత్తగా అనిపిస్తే అటు వైపు జనాలు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు టెలికాం రంగంలో జియో తనదైన ముద్ర వేసుకుంది. కానీ, ఇప్పుడు రీఛార్జ్ ప్లాన్స్ పెరగడంతో యూజర్ల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా ముందు ఉన్నాయి. అయితే, తాజాగా వోడాఫోన్ తమ యూజర్లకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంత వరకు లేని కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ని వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది.

VI 3699 ప్లాన్ ఆఫర్

రూ. 3699 రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1.5 GB డేటా, 100 ఎస్ఎంఎస్‌లు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇండిపెండెన్స్ డే ఆఫర్‌ నడుస్తుంది. ఇప్పుడు ఈ ప్లాన్ లో అదనంగా 50 జీబీ డేటా వస్తుంది. అలాగే ఒక సంవత్సరం పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ప్లాన్ ఉచితంగా లభిస్తుంది.

VI 3624 ప్లాన్ ఆఫర్

రూ. 3624 రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1.5 GB డేటా, 100 ఎస్ఎంఎస్‌లు సెండ్ చేసుకోవచ్చు. ఇండిపెండెన్స్ డే ఆఫర్‌లో భాగంగా అదనంగా 50 జీబీ డేటా 90 రోజులు లభిస్తుంది. అదే కాదు ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ గా పొందొచ్చు.

VI 1749 ప్లాన్ ఆఫర్

VI 1749 ప్లాన్ ఆఫర్ రీఛార్జ్ చేసుకుంటే.. అన్‌లిమిటెడ్ కాల్స్, 180 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. ఈ రోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా అదనంగా 30 జీబీ డేటా కూడా పొందవచ్చు. 

Tags:    

Similar News