వాట్సాప్ నుంచి మాయం కావడం ఎలా?

వాట్సాప్ మన రోజు వారీ పనుల్లో ఓ భాగమైపోయింది.

Update: 2023-03-27 06:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: వాట్సాప్ మన రోజు వారీ పనుల్లో ఓ భాగమైపోయింది. మన ఫ్రెండ్స్ తో టచ్‌లో ఉండాలన్నా.. ఫ్యామిలీతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకోవాలన్నా, వృత్తి, ఉద్యోగ జీవితం ఇలా అన్నీ ప్రస్తుత కాలంలో వాట్సాప్‌తో ముడి పడి ఉన్నాయి. సమాచార మార్పిడికి వాట్సాప్ ఎంతగానో ఉపయోగపడుతోంది.

అయితే కొన్ని సందర్భాల్లో మనతో టచ్లో ఉన్న మన బాస్‌లు, ఉన్నతాధికారులు, స్టాకర్లు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ లేదా బాయ్ ఫ్రెండ్, లేదా మాజీ భర్త, భార్యలతో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అయితే వీటిని నివారించేందుకు యాప్ గోప్యతా ఫీచర్‌లపై మనకు సరైనా అవగాహన ఉంటే ఈ ప్రాబ్లమ్ మనకు ఎదురవదు. వాట్సాప్ నుంచి మిమ్మల్ని మీరు ఎలా సెక్యూర్ చేసుకోవచ్చో, అలాంటి ఇబ్బందులను ఎలా అధిగమించొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆన్ లైన్ స్టేటస్, లాస్ట్ సీన్ దాచి ఉంచేందుకు..

ఇన్ టైంలో ప్రతిసారి రిప్లై ఇవ్వడం సాధ్యం కానీ వారు మీ నంబర్ లాస్ట్ సీన్‌లో కనిపించకుండా ఉండేందుకు Settings>Privacy>Last seen ఆప్షన్ లోకి వెళ్లి Nobody ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది. ఈ ఆప్షన్‌తో వాట్సాప్‌లో ఇతరులు పంపిన మెసెజ్ మీరు చూశారో లేదో అనే విషయం మీకు మెసెజ్ చేసిన వారికి తెలియకుండా ఉంటుంది. అలాగే మీరు ఆన్ లైన్ లో ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలియకుండా ఉండాలంటే Same as last seen అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తద్వారా మీరు ఆన్ లైన్‌లో ఉన్నారో లేదో అనే విషయం గోప్యంగా ఉంచొచ్చు.

రీడ్ రిసిప్ట్స్‌ని ఆఫ్ చేయండిలా..

లాస్ట్ సీన్ కనిపించకుండా సెట్ చేసుకున్న తర్వాత రీడ్ రిసిప్ట్స్ కూడా వాట్సాప్‌లో చాలా కీలకం. మెసెజ్‌లను మనం చదివామా లేదా అనే విషయాన్ని రీడ్ రిసిప్ట్ తెలియజేస్తాయి. వీటిని ఆఫ్ చేయడానికి Settings> Privacy> Read receipt's>switch off

స్టేటస్ అప్‌డేట్ నచ్చినవారే చూసేందుకు..

స్టేటస్ అప్ డేట్‌ను నిర్దిష్ట కాంటాక్ట్‌లకు పరిమితం చేసేందుకు గాను మనం పెట్టుకున్న స్టేటస్ దాచుకునేందుకు ఫిబ్రవరి నుంచి కొత్త ఆప్షన్‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. ‘Only share with’ ఆప్షన్ ద్వారా మన దగ్గరి వ్యక్తులకు మన సీక్రెట్స్‌తో పాటు ఏవైనా జోక్స్ పంచుకోవచ్చు. ఇందుకు గాను Settings>Status>Privacy లో వెళ్లి ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

ప్రొఫైల్ ఫోటో దాచడానికి..

వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీ కోసం మన ప్రొఫైల్ ఫోటోను దాచి ఉంచేందుకు ఓ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచింది. ఇందుకు గాను Settings>Privacy>Profile Photo> Nobody ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఈ ఆప్షన్ తో అసలు మీరు వాట్సాప్ లో ఉన్నారా లేదా అని తలలు పట్టుకుంటారు.

ఎబౌట్(about)ను దాచడం ఇలా..

పైన ఆప్షన్‌లన్నింటిని దాచిన తర్వాత ఇక కేవలం మన గురించి రాసుకునే (About) ను దాచి ఉంచేందుకు Settings>Privacy>About లోకి వెళ్లి Nobody ఆప్షన్‌ను ఎంచుకుంటే మీరు వాట్సాప్ నుంచి మాయం అవ్వొచ్చు. 

Tags:    

Similar News