టూరిస్టులను ట్రాప్ చేసిన గూగుల్ మ్యాప్స్.. ఎక్కడికి చేర్చిందో చూస్తే షాక్..

నేటి కాలంలో సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.

Update: 2024-03-04 09:03 GMT

దిశ, ఫీచర్స్ : నేటి కాలంలో సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. షాపింగ్ చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా చాలా వరకు ప్రజల టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. అలాగే కొత్త ప్రదేశాలకు సెల్ఫ్ డ్రైవింగ్ లో వెళితే లొకేషన్ కోసం కచ్చితంగా Google Map ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఈ Google Map ని ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నారు. ఇది ప్రజలకు వారు చేరాల్సిన గమ్యస్థానాన్నిచూపడానికి పని చేస్తుంది. సాధారణంగా ఇది ఎప్పుడూ కరెక్ట్ మార్గాన్నే చూపినా కొన్ని సార్లు మాత్రం తప్పు రూట్ ని చూపిస్తుంది. దీంతో వారు ఒక్కసారిగా అవాక్కవుతారు. ఇలాంటి సంఘటలనే ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. జర్మనీకి చెందిన కొంతమంది పర్యాటకులకు ఇలా జరిగింది. గూగుల్ మ్యాప్ వారిని ఆస్ట్రేలియాలోని అడవిలోకి దారి తప్పించింది.

అసలు విషయం ఏమిటంటే ఇద్దరు జర్మన్ టూరిస్టులు ఫిలిప్ మేయర్, మార్సెల్ స్కోనీ గూగుల్ మ్యాప్ చూపిన మార్గంలో ప్రయాణిస్తున్నారు. వారు నిజానికి కెయిర్న్స్ నుంచి బమగా అనే ప్రాంతానికి వెళ్లాలని అనుకున్నారు. కానీ గూగుల్ మ్యాప్స్ వారిని నేరుగా మూసివేసిన నేషనల్ పార్క్ వైపు తీసుకెళ్లింది. అక్కడ ఎవరూ ఉపయోగించని ఓ పాత మట్టి రోడ్డు గుండా 37 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక కారు బురదలో కూరుకుపోయింది. అక్కడ కనీసం ఫోన్ సిగ్నల్ కూడా రాకపోవడం, వారు తినేందుకు ఆహారం, నీరు లేకపోవడంతో వారు అక్కడే ఉంటే చనిపోవడం ఖాయమని అనున్నారు. తరువాత టూరిస్టులు వారి కారును అక్కడే విడిచిపెట్టి కాలినడకను ప్రారంభించారు. కాలినడకన ప్రయాణంలో చేస్తూ వారు తుఫాను, విపరీతమైన వేడి సహా కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చిందని తెలిపారు. అంతే కాదు మొసళ్ళతో నిండిన నదిని దాటవలసి వచ్చిందట.

ఇద్దరు పర్యాటకులు సురక్షితం..

కొన్ని నివేదికల ప్రకారం ఒక వారం నడక ప్రయాణంలో ఆ జర్మన్ పర్యాటకులు మునుపెన్నడూ ఊహించని ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలిపారు. వారి జీవితం ఓ సినిమా కథలా మారిందని కోయెన్ నగరానికి తిరిగి వెళ్ళడానికి వారికి ఒక వారం పట్టిందని తెలిపారు. అయితే ఇద్దరు పర్యాటకులు పూర్తిగా సురక్షితంగా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ విషయం విచారణలో ఉందని గూగుల్ ప్రతినిధి తెలిపారు.

Read More..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్మశానవాటిక ఏది.. అలా ఎందుకు పిలుస్తారు.. ?  

 

Tags:    

Similar News