గూగుల్‌లో మరోసారి ఉద్యోగుల తొలగింపులు!
ఐటీ రంగంలో మరోసారి భారీ కుదుపు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీ గూగుల్ గత రెండేళ్లుగా వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: ఐటీ రంగంలో మరోసారి భారీ కుదుపు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీ గూగుల్ గత రెండేళ్లుగా వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఉద్యోగులపై వేటు వేసేందుకు గూగుల్ సిద్ధమైంది. దీంతో సంస్థలోని పలువురు ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించినట్లు సమాచారం.
ఎంత మందిని ఉద్యోగం నుంచి తీసివేశారనేది మాత్రం సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. మరోవైపు ఈ తొలగింపులు కంపెనీ అంతటా ఉండవని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రభావితమైన ఉద్యోగులు సంస్థలోని ఇతర ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రభావితమైన ఉద్యోగుల్లో కొంత మందిని కంపెనీ పెట్టుబడులు పెడుతున్న భారత్, చికాగో, అట్లాంటా, డబ్లిన్ వంటి కేంద్రాలను బదిలీ చేయనున్నట్లు గూగుల్ కంపెనీ అధికారి వెల్లడించారు.