భారతదేశ విజ్ఞానాన్ని రక్షించనున్న బయోపైరసీ ఒప్పందం.. అంటే ఏంటో తెలుసా ?
తరం నుంచి తరానికి సంక్రమించిన జ్ఞానం ఇక పై సమ్మతి లేకుండా ఉపయోగించలేరు.
దిశ, ఫీచర్స్ : తరం నుంచి తరానికి సంక్రమించిన జ్ఞానం ఇక పై సమ్మతి లేకుండా ఉపయోగించలేరు. ఇందుకోసం ప్రపంచంలోని 190కి పైగా దేశాలు కొత్త ఒప్పందానికి అంగీకరించాయి. ఈ ఒప్పందం తర్వాత, బయోపైరసీని నిషేధించవచ్చు. మే 13 నుంచి 24 వరకు జెనీవాలో జరిగిన ముఖ్యమైన సదస్సులో ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఇంతకీ ఈ బయోపైరసీ అంటే ఏమిటి, అది ఎలా ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.
ముందుగా బయో పైరసీ అంటే ఏమిటో తెలుసుకుందాం. జర్మన్ వెబ్‌సైట్ DW నివేదిక ప్రకారం బయోపైరసీ అనేది ఒక తరం నుండి మరొక తరానికి నిరంతరం బదిలీ చేసే జ్ఞానాన్ని సమ్మతి లేకుండా ఉపయోగించడం. ఉదాహరణకు మొక్క ఔషధ గుణాలు, దాని ఉపయోగం గురించిన సమాచారం కూడా ఈ వర్గంలో వస్తుంది.
పసుపునకు అమెరికా పేటెంట్..
అమెరికాలో జరిగిన ఓ విషయం గురించి తెలుసుకుంటే బయోపైరసీని బాగా అర్థం చేసుకోవచ్చు. అది 1994వ సంవత్సరం. అమెరికాలోని మిస్సిస్సిప్పి యూనివర్శిటీకి చెందిన ఇద్దరు రీసెర్చ్ స్కాలర్లు సుమన్ దాస్, హరిహర్ కోహ్లీ, పసుపు క్రిమినాశక లక్షణాల కోసం US పేటెంట్, ట్రేడ్‌మార్క్ కార్యాలయం ద్వారా పేటెంట్ పొందారు. ఈ వార్త భారత్‌కు తెలియగానే పెద్ద దుమారమే రేగింది. ఎందుకంటే శతాబ్దాలుగా భారతదేశంలో పసుపును ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఇది ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించారు. అలాంటప్పుడు పసుపు పై అమెరికా పేటెంట్ ఎలా మంజూరు చేస్తుంది అనే ప్రశ్న తలెత్తింది.
ఇదిలా ఉంటే భారతదేశం తరఫున ఈ పురాతన జ్ఞానాన్ని కాపాడటానికి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పసుపు సమస్య పై కేసు దాఖలు చేసింది. దీని తరువాత 1997 సంవత్సరంలో అమెరికాకు చెందిన పేటెంట్, ట్రేడ్‌మార్క్ కార్యాలయం ఇద్దరు పరిశోధనా స్కాలర్‌ల పేటెంట్‌ను రద్దు చేసింది.
జెనీవాలో చర్చ తర్వాత ఆమోదం..
ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి సమస్యలు, వివాదాలను పరిష్కరించడానికి, ఎవరి సాంప్రదాయ జ్ఞానం లేదా వైద్య అభ్యాసాన్ని దొంగిలించకుండా నిరోధించడానికి, జెనీవాలో గ్లోబల్ బయోపైరసీ ఒప్పందం గురించి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం UN వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. సుదీర్ఘ చర్చల తర్వాత మేధో సంపత్తి, జన్యు వనరులు, సాంప్రదాయ జ్ఞానం మధ్య ఇంటర్‌ఫేస్‌ను పరిష్కరించే మొదటి బయోపైరసీ ఒప్పందాన్ని అన్ని దేశాల ప్రతినిధులు ఆమోదించారు.
బయో పైరసీ ఒప్పందంతో ఏమి మారుతుంది ?
ఇందులో 190 కంటే ఎక్కువ దేశాలు బయోపైరసీని ఎదుర్కోవడానికి, ఔషధ మొక్కల వంటి జన్యు వనరులకు సంబంధించిన పేటెంట్లను నియంత్రించడానికి కొత్త ఒప్పందానికి అంగీకరించాయి. ముఖ్యంగా సాంప్రదాయ జ్ఞానంతో కూడిన మొక్కలు. బయోపైరసీ ఒప్పందంతో ఆ సంఘంలోని ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ చేయబడిన అటువంటి సమాచారాన్ని మరొక సంఘం అనుమతి లేకుండా ఏ వ్యక్తి పేటెంట్ చేయలేరు. నివేదిక ప్రకారం ఇది ఏదైనా మొక్క, పంట లేదా ఏదైనా జాతి జంతువు ఔషధ గుణాల పరిజ్ఞానం, ఉపయోగంతో కూడా అనుసంధానించారు.
🚨BREAKING: WIPO Member States adopt historic new treaty on intellectual property, genetic resources and associated traditional knowledge: https://t.co/y3BIrBUGaf.#GrTkDipCon pic.twitter.com/aF3wutaaRZ
— World Intellectual Property Organization (WIPO) (@WIPO) May 24, 2024