Whatsapp: వాట్సాప్‌లో మరో ఆకర్షణీయమైన ఫీచర్.. ఇకపై రంగులే రంగులు..

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ (Smart Phone) లేని వ్యక్తి లేడంటే అతిశయోక్తి కాదు.

Update: 2025-02-15 03:35 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ (Smart Phone) లేని వ్యక్తి లేడంటే అతిశయోక్తి కాదు. అలాగే స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి వాట్సాప్ (WhatsApp) యాప్ గురించి తెలిసే ఉంటుంది. ఇక యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో సూపర్ ఫీచర్‌ను వినియోగదారులకు పరిచయం చేసింది.

ఈ కొత్త ఫీచర్‌ సాయంతో యూజర్లు నచ్చిన విధంగా చాట్‌ థీమ్‌, చాట్‌ బబుల్‌ని మార్చుకోవచ్చు. ఇందులో 30 రకాల వాల్‌పేపర్‌ ఆప్షన్లు ఉన్నాయి. కావాలంటే కెమెరాతో బంధించిన ఫొటోలనూ చాట్‌ థీమ్‌గా పెట్టుకోవచ్చు. సాధారణంగా వాట్సప్‌లో మనం పెట్టే మెసేజ్‌లు ఆకుపచ్చ (Green) రంగుల్లో.. మనకు పంపే మెసేజ్‌లు తెలుపు (White) రంగులో కనిపిస్తాయి. వీటిని కూడా ఇకపై నచ్చిన రంగులకు మార్చుకోవచ్చు. యూజర్ల అనుభవాన్ని మెరుగపరిచి, చాటింగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు వాట్సాప్ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ థీమ్‌ మీకు మాత్రమే కనిపిస్తుంది. వాట్సప్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నవారు కూడా ఈ ఫీచర్‌ని వినియోగించుకోవచ్చు.

ఇక Settings>Chats>Default chat theme ని ఎంచుకొని ఈ థీమ్‌ని ఛేంజ్‌ చేయొచ్చు. iOS డివైజ్ అయితే వాట్సాప్​ ఓపెన్ చేస్తే అందులో పైన స్క్రీన్‌లో చాట్ నేమ్ ఆప్షన్ కన్పిస్తుంది. దీని ద్వారా యాపిల్ డివైజెస్‌లో వాట్సాప్ చాట్ థీమ్స్‌ను మార్చుకోవచ్చు. ఇప్పటికే వాట్సప్‌ యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. యాప్‌ని అప్‌డేట్‌ చేసుకొని మీరు కూడా దీనిని ట్రై చేయండి. 

Tags:    

Similar News